ప్రభాస్ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రానికి 'వారధి' అనే పేరు పరిశీలనలో ఉంది. పుణె శివార్లలోని లావాసా ప్రాంతంలో పాటను చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రఘు నృత్యరీతులు సమకూరుస్తారు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి. ‘వారధి' అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని, అంతకంటే పవర్ ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నామని, ప్రభాస్ ఇమేజ్‌కు తగిన విధంగా మరో మంచి టైటిల్ కోసం వెతుకున్నామని చిత్రం యూనిట్ సభ్యులు
No comments:
Post a Comment