
రాజమౌళి దర్శకత్వంలో నటించడమంటే కేవలం రెండేళ్ల పాటు సమయం కేటాయించడమే కాకుండా.. జుట్టు, గడ్డం కూడా పెంచుకొని తిరగాలి. 'మగధీర' సమయంలో చరణ్ పొడవాటి జులపాలతో తిరిగేవాడు. ఇప్పుడు ప్రభాస్‌కి జుట్టుతో పాటు గడ్డం పెంచేభారం కూడా పడింది. 'బాహుబలి' షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ప్రభాస్ ఫైనల్ లుక్ ఏంటనేది ఇంకా నిర్ణయించలేదు. అయితే ప్రభాస్ మాత్రమే కాకుండా రాణా కూడా ఇలా కనిపిస్తాడు. ఇంకా ఈ చిత్రంలో అనేక మంది నటులు కూడా ఇదే రూపంతో కనిపించబోతున్నారు. ప్రభాస్, రానా హైట్‌కు మ్యాచ్ అయ్యే వారినే ఏరికోరి రాజమౌళి ఎంపికచేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్క బోతోంది.
No comments:
Post a Comment