Tuesday, October 1, 2013

ప్రభాస్ అడుగులకు రాజమౌళి బ్రేక్ !



ప్రభాస్ వేయబోయే అడుగులకు దర్శకుడు రాజమౌళి బ్రేక్ వేశాడు అడుగు వేశావో అంతే సంగతి నిండా మునిగిపోతావు అని హెచ్చరించినంత పనిచేశాడట. ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ తో 'బాహుబలి' సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తవడానికి ఓ ఏడాదోఎడాదిన్నరో  సమయం పట్టే అవకాశం ఉన్నది. దాంతో ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు తో 'ఒక్క అడుగు' సినిమా చేసేందుకు ఒప్పుకున్నా విషయం తెలిసిందే. బాహుబలి పూర్తయ్యాకే ప్రారంభించాలని అనుకున్నాడు ప్రభాస్. కానీ ఆ సినిమా పూర్తయ్యేందుకు సమయం పట్టేలా ఉండటంతో 'ఒక్క అడుగు' సినిమాని అక్టోబర్లో మొదలు పెట్టి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి విడుదల చేయాలని అనుకున్నాడు. 'బాహుబలి' షూటింగ్ విరామ సమయాల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ రాజమౌళి ప్రభాస్ ను అలాచేస్తే బాగుండదు బాహుబలి కి ఇప్పుడు వస్తున్న పేరుకు డ్యామేజి అవుతుంది. బాహుబలి పూర్తవుతుందో లేదో అన్న అనుమానాలు మొదలవుతాయి. ఈ సినిమ్పై అంత నమ్మకం లేకే ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడు అంటారు. కనుక 'ఒక్క అడుగు' ఆ సినిమా వైపు వేయద్దు అని చెప్పాడట. 

No comments:

Post a Comment