ఈ నేపధ్యంలో చాలా రోజుల తర్వాత చిత్ర యూనిట్‌కు అనుష్క కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారట. బొద్దుగా ఆంటీలా కనిపించే అనుష్క స్లిమ్‌గా ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్‌లా తయారయ్యిందట. ఇటీవల అనుష్క మిర్చి సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించడంతోపాటు, సింగం-2 సినిమాలో ఆంటీలా కనిపించింది. దీంతో అనుష్క పనైపోయిందని వార్తలు వచ్చాయి. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇంత స్లిమ్‌గా తయారైనట్లు చెబుతున్నారు.
ఈ సినిమా కోసం అనుష్క గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి విద్యలు నేర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అనుష్క కూడా జాయిన్ అవడంతో షూటింగు మరింత స్పీడందుకుంది. ఇంకా ఈ షూటింగులో రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు కూడా పాల్గొంటున్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు
No comments:
Post a Comment