Friday, January 24, 2014

ప్రభాస్ భార్య ఫైనలజ్ !


 
ప్రభాస్ పెళ్ళికి సంబందించిన చర్చ పరిశ్రమలో గతకొన్ని రోజులుగా జరుగుతుంది. దీనిపై ప్రభాస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు కానీ అతని పెళ్లి టాక్ అఫ్ ది టౌన్ అయింది. అయితే తాజాగా తన పెళ్ళికి లైన్ క్లియర్ అయిందని తెలుస్తుంది. ప్రభాస్ కుటుంబం ఓ అమ్మాయిని చూసినట్లు తెలుస్తుంది. భీమవరం ధనిక కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని అతని కుటుంబ సభ్యులు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఇద్దరి కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయట. పెళ్లి కూతురు తండ్రి పెద్ద రొయ్యల వ్యాపారి అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే....ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న  బాహుబలి సినిమా పూర్తయిన తర్వాతే ప్రభాస్ పెళ్లి ఉంటుందట. బాహుబలి విడుదలకు ముందే ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం చేస్దామని ప్రభాస్ కుటుంబం వధువు కుటుంబాని అడిగారట. ఇదే విషయాన్నీ తన పెద్ద నాన్న కృష్ణం రాజు తన పుట్టినరోజు అధికారికంగా చెప్పిన విషయం తెలిసిందే. సో ప్రభాస్ ఓ ఇంటివాడు కావడానికి మరో ఏడాది ఉన్నదనమాట .

No comments:

Post a Comment