Showing posts with label latest news. Show all posts
Showing posts with label latest news. Show all posts

Thursday, September 6, 2018

ప్రభాస్ అధికారికంగా ప్రకటించేశాడు

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేస్తున్న ‘సాహో’. దాదాపు రెండు సంవత్సరాలుగా ‘సాహో’ తప్ప మరే ప్రాజెక్ట్ ను ప్రభాస్ సెట్స్ పైకి తీసుకు వెళ్లలేదు. వచ్చే సమ్మర్ లో ‘సాహో’ చిత్రం విడుదల కాబోతుంది. దాదాపు ఏడు సంవత్సరాల్లో కేవలం  ‘బాహుబలి’ మరియు సాహో చిత్రాలకే ప్రభాస్ సమయం అంతా కేటాయించాడు. అందుకే ఇకపై చాలా స్పీడ్ గా సినిమాలు చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘సాహో’ చిత్రం పూర్తి కాకుండానే తదుపరి చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది.
ప్రభాస్ తదుపరి చిత్రం త్రిభాష చిత్రంగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయంపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. తన త్రిభాష చిత్రం గురించి ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని - త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంకు కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా ప్రభాస్ పేర్కొన్నాడు. గోపీ కృష్ణతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ చిత్రంను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో తనకు జోడీగా పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. మొన్నటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు రాగా - ఆమెకు ప్రస్తుతం క్రేజ్ అంతగా లేదు. ఆ కారణంగానే పూజాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది.

Tuesday, September 4, 2018

ప్రభాస్ కోటిచ్చాడు..

కేరళ క‘న్నీటి’ వర్షంలో తడిసిముద్దైన సంగతి తెలిసిందే.. శతాబ్ధకాలంలోనే పెద్ద ఎత్తున ముంచెత్తిన వరదలతో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో మరణించారు. కేరళను ఆదుకోవాలని అక్కడి సీఎం పిలుపునివ్వడంతో ఎంతో మంది ఎన్నో కోట్ల రూపాయలను పంపించారు. వివిధ దిగ్గజ సంస్థలు ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.
కేరళను ఆదుకోవడంలో సినీ ప్రముఖులు కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు - తమిళం - మలయాళ - హిందీ నటులు ఇతోధికంగా సాయం చేశారు. కానీ ఇతర సినీ స్టార్లతో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ ఆర్థిక విరాళాలు తక్కువే అందించారనే విమర్శ ఉంది. అందరికంటే ముందు తమిళ స్టార్ హీరో బ్రదర్స్ సూర్య-కార్తి సోదరులు రూ.25 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత మిగతా హీరోలు కూడా భారీగానే విరాళాలందించారు.

తాజాగా మలయాళ సినీ స్టార్ల పిసినారితనంపై కేరళ టూరిజం శాఖ మంత్రి కడకంపల్లి సుందరేశన్ - నటి సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మలయాళ నటులు విరాళాలు పెద్ద ఎత్తున ఇవ్వలేదని వారు మండిపడ్డారు. కోట్ల విలువ చేసే కార్లలో తిరిగే నటులున్న మలయాళ ఇండస్ట్రీలో సాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదని మండిపడ్డారు. 

కేరళ మంత్రి సుందరేశన్ మాట్లాడుతూ ‘మన రాష్ట్రంలో గొప్ప నటులున్నారు. ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకూ సంపాదిస్తున్నారు. కానీ లక్షల్లోనే ఇచ్చారు. మలయాళంలో పెద్దగా మార్కెట్ లేని తెలుగు హీరో ప్రభాస్ రూ.కోటి విరాళం ఇచ్చారు. అతడిని చూసి నేర్చుకోండి’ అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. 

అసలు అధికారికంగా ప్రభాస్ విరాళం ఇచ్చాడని తెలుసు కానీ ఎంతిచ్చాడనేది ఎవ్వరికీ తెలియదు.. ఆయన ఫ్యాన్స్ 25 లక్షలు ఇచ్చాడని అనుకున్నారు. ప్రభాస్ కూడా తాను విరాళమిచ్చిన విషయాన్ని బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు కేరళ మంత్రి... ప్రభాస్ కోటి రూపాయలు ఇచ్చాడని అనడం.. ప్రభాస్ ది గొప్ప మనసు అని కీర్తించడం చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో మంచి చేసి కూడా ప్రచారం చేసుకోలేదంటూ కొనియాడుతున్నారు. ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది. 

Thursday, August 30, 2018

భారతంలో అర్జునుడుగా ప్రభాస్?

మిస్టర్ పెర్ఫెక్ట్ వర్సెస్ మిస్టర్ పెర్ఫెక్ట్!  బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వేసిన బిగ్ ట్రాప్లో టాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ప్రభాస్ అడ్డంగా ఇరుక్కోబోతున్నాడా? అంటే అవుననే తాజాగా సమాచారం అందింది. అయితే ప్రభాస్ని ఇరికించే అమీర్ ప్లానేంటో తెలియాలంటే డీప్గా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.
మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత కొంతకాలంగా `మహాభారతం 3డి` చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ అంబానీతో కలిసి దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో మహాభారతం సిరీస్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మూడు నుంచి ఐదు భాగాలుగా తెరకెక్కించేందుకు తనకు ఏకంగా పదేళ్ల సమయం పడుతుందని ప్రకటించాడు. 

ఆ క్రమంలోనే ఈ సినిమాలో నటించే కాస్టింగ్ విషయమై ఆసక్తికర చర్చ సాగింది. అమీర్ ఖాన్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ దీపిక పదుకొనే వంటి స్టార్లను సంప్రదించారన్న చర్చ సాగింది. అమీర్ కృష్ణుడిగా నటిస్తే దీపిక పదుకొనే ద్రౌపది పాత్ర పోషించనుందని ప్రచారమైంది. ఇప్పుడు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ ఈ చిత్రంలో అర్జునుడు పాత్రలో నటిస్తాడని ప్రచారమవుతోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్ ప్రచారం మేరకు.. ఇప్పటికే మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ బాహుబలి ప్రభాస్ని సంప్రదించాడని తెలుస్తోంది. వాస్తవానికి గత కొంతకాలంగా మహాభారతం తెరకెక్కుతుందా.. లేదా? అన్న సందిగ్ధత నెలకొందని వార్తలొచ్చాయి. పురాణేతిహాసాలతో ఎన్నో చిక్కులుంటాయి. `పద్మావతి` తెరకెక్కించేప్పుడు భన్సాలీకి ఎదురైనట్టే.. సేమ్ సన్నివేశమే రిపీటైతే అది పెద్ద రిస్క్ అవుతుందని భావించి అమీర్ సైలెంటుగా ఉన్నారని ప్రచారమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మిస్టర్ పెర్ఫెక్ట్ ఈ ప్రాజెక్టు విషయమై రాజీకొచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారట. ఆ క్రమంలోనే కాస్టింగ్ సెలక్షన్స్ లోనూ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు అమీర్ అమితాబ్ వంటి స్టార్లు నటించిన `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. 

Sunday, April 2, 2017

మూడు బాషల్లో ప్రభాస్ 'సాహో'


ఇక ఏప్రియల్ 28న ''బాహుబలి 2'' రిలీజ్ అయిపోయిందంటే.. కండలవీరుడు ప్రభాస్ పూర్తిగా ఆ టింట్ నుండి బయటకు వచ్చేసినట్లే. అయితే ప్రభాస్ ఆల్రెడీ బయటకు వచ్చేశాడని మారిపోయిన తన హెయిర్ స్టయిల్ చూస్తే మనకు అర్ధమైపోతోందిగా. ఇప్పుడు తన తదుపరి సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. 

నిజానికి కొత్త కుర్రాడు సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమాను ఆల్రెడీ మొదలెట్టేశాడు. ఈ సినిమా తాలూకు టీజర్ ను బాహుబలి 2 సినిమాతో పాటు రిలీజ్ చేస్తారని టాక్ ఉంది. అయితే ఈ సినిమాను ఒకేసారి తెలుగు తమిళ్ హిందీ బాషల్లో రూపొందించడమే ప్లాన్. అలాంటప్పుడు సినిమా టైటిల్ ఏమని పెట్టాలి? బాహుబలి తరహాలో మూడు బాషల్లో ఒకే టైటిల్ అయితే బెటర్ అని అంచనాలకు వచ్చేసి ఒక టైటిల్ పిక్ చేశారు. ''సాహో'' అనే పేరు బాహుబలిలోని సాంగుతో బాగా పాపులర్ అయ్యింది. అందుకే ఇప్పుడు ''సాహో'' అనే టైటిల్ యువి క్రియేషన్స్ వారు రిజిష్టర్ చేశారు. 

సాహో సినిమాతో.. ప్రభాస్ బాహుబలి ద్వారా ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో.. అంత పేరును నిలబెట్టుకోవాల్సి ఉంది. మరి చూద్దాం ఈ సాహో ఎలా ఉండోబోతోందో

Sunday, March 5, 2017

రాజమౌళి నుంచి పర్సనల్ విషయాలను నేర్చుకున్న ప్రభాస్ !


నంది అవార్డు గెలుచుకున్న జోష్ లో ఉన్న ప్రభాస్ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేయడంతో పాటు రాజమౌళి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను రాజమౌళిని ఒక దర్శకుడులా కాకుండా ఒక గురువుగా ముఖ్యంగా ఒక యూనివర్శిటీ ప్రొఫిసర్ లా భావిస్తానని ఆయన దగ్గర నుండి నటనకు సంబంధించి మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలకు సంబంధించి కూడ అనేక విషయాలను రాజమౌళి నుంచి నేర్చుకున్నాను అంటూ జక్కన్న పై తన భక్తిని చాటుకున్నాడు ప్రభాస్.

ఇదే సందర్భంలో ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న పత్రికా ప్రతినిధి ప్రభాస్ ను ‘బాహుబలి’ గడ్డం పై ప్రశ్నించినప్పుడు ఒక ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చాడు ప్రభాస్. తనకు రోజు షేవ్ చేసుకోవడం అంటే తనకు చాల చిరాకు అని అందువల్ల ‘బాహుబలి’ కోసం తాను ఇన్ని సంవత్సరాలుగా గడ్డంతో ఎటువంటి బోర్ లేకుండా హయిగా ఉన్నాను అంటూ తన ‘బాహుబలి’ గడ్డం పై తానే సెటైర్లు వేసుకున్నాడు ప్రభాస్. 

ఇక తనకు కాబోయే భార్య ఎలాఉండాలి అని చెపుతూప్రభాస్ ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. తన కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా తన పెదనాన్న కృష్ణంరాజు కుటుంబం కూడా విపరీతమైన భోజన ప్రియులం అని చెపుతూ తనకు కాబోయే భార్య రకరకాల వంటలు తెలియకపోయినా పరవాలేదు కాని తమతోపాటుగా రకరకాల వంటలను ఆస్వాదిస్తూ తినగల మనస్థత్వం ఆ అమ్మాయికి ఉండాలి అంటూ అటువంటి అమ్మాయి కోసమే ఎదురుచూస్తుండటంతో తన పెళ్ళి లేట్ అవుతోంది అంటూ జోక్ చేసాడు.  

ఇక తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ ఇప్పటి నుంచి కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ గతంలో తాను తన అభిమానులకు మిస్ చేసిన ఆనందాన్ని తిరిగి ఇవ్వబోతున్నాను అని అంటూ తనకు అవకాశం వస్తే మల్టీ స్టారర్ మూవీలో కూడ నటించాలి అన్న కోరిక ఉంది అన్న విషయాన్ని బయట పెట్టాడు ప్రభాస్. ఇదే సందర్భంలో సుజిత్ తో చేయబోతున్న తన లేటెస్ట్ మూవీ మాట్లాడుతూ ఆ మూవీలో తన లుక్ నుంచి తన హెయిర్ స్టైల్ వరకు అన్నీ డిఫరెంట్ గా కనిపించబోతాయి అన్న లీకులు ఇస్తున్నాడు ప్రభాస్. 

ఇక ఆఖరిగా సినిమాలలో నటించినట్లుగా రియల్ లైఫ్ లో నటించడం తనకు రాదు అని అంటూ మహా అయితే మరో 10 సంవత్సరాలపాటు నటిస్తానేమో అని అంటూ తాను జీవితాంతం సినిమాలలో నటించే ఓపిక లేదు అని తనపై తానే కామెంట్ చేసుకున్నాడు ప్రభాస్..   

Saturday, October 1, 2016

ప్రభాస్ సాధించిన రేర్ ఫీట్

కంగ్రాట్స్ ప్రభాస్..తెలుగు సినిమా పరిశ్రమలో ఈ తరహా గౌరవానికి ఇధే శ్రీకారం. మేడమ టస్సాడ్ మ్యూజియమ్ లో ఓ తెలుగు హీరో విగ్రహం పెట్టడం ఇదే తోలిసారి. బాలవుడ్ హీరోలు, హీరోయిన్ల విగ్రహాలు చాలా వున్నాయి టస్సాడ్ మ్యూజియమ్ లో. కానీ తెలుగు హీరో , హీరోయిన్ల విగ్రహాలు వున్నట్లు లేదు. 
ప్రభాస్ తన బాహుబలితో ఆ కొరత తీర్చేసాడు. బాహుబలి రూపంలో వున్న ప్రభాస్ విగ్రహం మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్ లో కొలువుతీరబోతోంది. ఈ మేరకు అక్కడి కళాకారులు వచ్చి, ప్రభాస్ శారీరక కొలతలు తీసుకుని వెళ్లారు.
దర్శకుడు రాజమౌళి అయిదవ తేదీన చెబుతామన్న ప్రత్యేక వార్త ఇదే. నాలుగు రోజులకు ముందే లీక్ అయిపోయింది. దాంతో ప్రభాస్ ఆఫీసు నుంచే ప్రెస్ నోట్ బయటకు రాక తప్పలేదు. అమితాబ్, షారూఖ్, సల్మాన్, మాధురి, సచిన్ ఇలా ఎందరో ఇండియన్ సెలబ్రిటీలు, మహాత్ముడు, ఇందిర, మోడీ ఇలా పలువురు రాజకీయ ప్రముఖుల విగ్రహాలు మేడమ్ టస్సాడ్ వాక్స్ మ్యూజియమ్ లో వున్నాయి. ప్రభాస్ విగ్రహం కూడా ఇప్పుడు అక్కడ కొలువుతీరుతుంది. నిజంగా అభినందించదగ్గ విషయమే
.

Rajamouli Makes Fun About Prabhas Marriage


Tuesday, September 27, 2016

Prabhas guest role in Singam 3?

There is a  good news for Rebel  fans and movie lovers. Tamil star Suriya and Rebel star Prabhas are going to share the screen space for the upcoming  action entertainer drama “Singam 3’ aka ‘S3’  under the direction  of Hari. Currently the makers are canning climax action sequence at Talakona forest near Guntur district, Andhra Pradesh.  It is heard that Suriya requested Prabhas to play the guest role in  the third franchise of Singam 3 and Baahubali star has agreed. It is not yet  clear  whether Prabhas will be seen in Police getup like Suriya  or any other type of roles. Anushka  Shetty will be seen in the role of Suriya’s wife  whereas hot diva Shruti Hassan will  be seen helping Suriya as Journalist. It is produced  under the banner of Studio Green and the music is scored by  Harris Jayaraj. The movie is set to hit the theaters on 16th December in a very grand manner.

Sunday, September 18, 2016

Muhurtham Fixed for Prabhas Movie Launch

On December 10th, Prabhas will be launching a new movie. After many postponements and confusion, Prabhas has given his agreement to have pooja ceremony for his next film on that day. The exact auspicious muhurtham with time will be fixed shortly.

Prabhas, who is now shooting for a song for Rajamouli's epic conclusive part of "Baahubali", will be doing a regular commercial movie after a gap of four years.

After the release of "Mirchi" in early 2013, he has moved to the shooting of "Baahubali". He will now be beginning the regular shoot of his new action drama from January 2017 but the pooja ceremony will be done this December.

Sujith of "Run Raja Run" fame will direct the new action drama and UV Creations will be producing it with a whopping Rs 100 Cr budget.

Set in the backdrop of Dubai, the action drama will have two heroines. Since Prabhas is now known all over the country, the makers are also planning to dub it in Hindi and Tamil languages as well.

Wednesday, September 14, 2016

Prabhas Praises Paralympic Gold Medal Winner

Prabhas praises Thangavelu
Everyone is aware of the achievement of PV Sindhu and Sakshi Malik, who won Silver and bronze medals in the recent Rio Olympic 2016, both received grand welcome and were facilitated with the huge prize money and other benefits in their respective states. Recently the Paralympic events were started and Indian  started to give  their best performance at this event. Paralympic Games, is a major international multi-sport event involving athletes with a range of disabilities, including impaired muscle power, impaired passive range of movement, limb deficiency and vision impairment etc. Mariyappan Thangavelu and Varun Singh Bhati, have  won the gold and bronze medal respectively in the men's high jump at Rio Paralympics 2016.  Mariyappan Thangavelu,  hailing from Chennai of Tamil Nadu.   Rebel star Prabhas praised him and tweeted,” #MariyappanThangavelu ,ur win is an inspirational story for everyone. Hats off to you on your gold medal #Paralympics.” On the other side Kabali star Rajinikanth also praised him. Tamil Nadu Chief Minister Jayalalitha also announced a reward of Rs 2 Crores  for  Mariyappan Thangavelu  for winning the gold medal in the high jump event and all the political party leaders congratulated  the youth for his achievement. Prime Minister Narendra Modi also tweeted,” India is elated! Congratulations to Mariyappan Thangavelu on winning a gold & Varun Singh Bhati for the bronze at the #Paralympics.”

Wednesday, August 24, 2016

Prabhas Disappoints Big Company

Young Rebel Star Prabhas was locked for the film Baahubali. Prabhas has been spending his maximum time on this magnum opus. Prabhas is not at all taking time at least to listen to the scripts of his upcoming films. His complete focus and concentration was on the film Baahubali. Rajamouli is busy with the shooting of the second part of the film titled Baahubali The Conclusion. With the success of the first part Baahubali The Beginning, Prabhas has become a national star. To cash his craze in National level, many big brands and companies approached him with the endorsement plans.
Similarly, a big brand has approached Prabhas for an endorsement recently while Prabhas is busy with the shoot of Baahubali The Conclusion. But it looks like Prabhas has rejected the deal citing the reason that he does not want to deviate from Baahubali shoot. The company has also offered him a bigger amount but Prabhas did not change his decision.
Baahubali The Conclusion is scheduled for a grand release on 28th April 2017.

Tuesday, August 16, 2016

ప్రభాస్ కు జోడి కోసం వెతుకులాట..!!


Prabhas, Prabhas Next Film, Prabhas Movies


బాహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. అంతర్జాతీయంగా అతనికి  గుర్తింపు లభించింది. సో తర్వాత ప్రభాస్ నటించే సినిమాలు తీసే డైరక్టర్లపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ బాహుబలి కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న చిత్రీకరణ అక్టోబర్ నాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత పెరిగిన బరువును తగ్గించుకుని రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ తో థ్రిల్లర్ సినిమాలో నటించనున్నారు.
ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలు కానుంది. యూవీ క్రియేషన్స్ వాళ్లు నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన అమీ జాక్సన్ ఖరారు అయింది. సుజీత్ సినిమా తర్వాత జిల్ డైరక్టర్ రాధాకృష్ణ తో డార్లింగ్ సినిమా చేయనున్నారు. విదేశాల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీలో కొత్త నటి కోసం డైరక్టర్ వెతుకుతున్నారు. అయితే  ప్రభాస్ హైట్ కి, రేంజ్ కి సరిపోయే అమ్మాయి దొరకడం కష్టంగా ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహిస్తున్నా డార్లింగ్ కి జోడి సెట్ కావడం లేదంట. ఇందుకోసం రాధాకృష్ణ అమ్రిత్ సర్, లక్నో, చండీగఢ్ లోని ట్యాలెంట్ ఏజెన్సీ వాళ్లను సైతం సంప్రదించారని తెలిసింది. మరి ఏ ఊరి ముద్దుగుమ్మకు ప్రభాస్ తో నటించే అవకాశం వరిస్తుందో వేచి చూడాలి.

Tuesday, January 26, 2016

కేరళ ఫారెస్ట్ లో ప్రభాస్ మ్యానియా !

article data
https://www.facebook.com/weloveprabhas.blogspot.in/?ref=tn_tnmn
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ విధంగా పెరిగి పోయిందో తెలియచేసే ఆ సక్తికర సంఘటన ఈమధ్య ‘బాహుబలి 2’ షూటింగ్ స్పాట్ లో జరిగింది. మలయాళ సినిమా రంగ హీరోలను మన తెలుగు ప్రేక్షకులు బాగా పట్టించుకుంటారు కానీ మన తెలుగు హీరోలను కేరళా రాష్ట్ర ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అల్లుఅర్జున్ సినిమాలు మలయాళంలో డబ్ చేయబడి కొన్ని సినిమాలు విజయం సాధించినా బన్నీ కనిపించగానే మలయాళీలు మ్యానియా వచ్చినట్లుగా ప్రవర్తించరు. 

అయితే కేరళా ఫారెస్ట్ లో ప్రస్తుతం ‘బాహుబలి 2’ షూటింగ్ జరుగుతున్నా విషయాన్ని గ్రహించి ఆ ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేవారే కాకుండా దూర ప్రాంతం నుంచి కూడ చాలామంది ప్రభాస్ అభిమానులు వచ్చి అమరేంద్ర బాహుబలిని చాల ఆరాధనగా చూడటం హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’ విడుదల తరువాత కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మన పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు కర్నాటక కేరళ ప్రాంతాలలో ప్రభాస్ ఇమేజ్ ఏ విధంగా పెరిగి పోయిందో ఈ షూటింగ్ స్పాట్ కు వచ్చిన జనాన్ని చూస్తే అర్ధం అవుతుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 


రాజమౌళి  ‘బాహుబలి 2’ షూటింగ్ ను కేరళ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ కాని లేదా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన వార్తలు కాని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ కేరళ ఫారెస్టులో షూటింగ్ స్పాట్ కు నడిచి వస్తున్న ఫోటోను ఒక ప్రభాస్ అభిమాని తన సెల్ ఫోన్ లో క్లిక్ చేసి ఇలా వెబ్ మీడియాలో పెట్టాడు.

అనుకున్న అంచనాలు ప్రకారం ‘బాహుబలి 2’ మరోసారి రికార్డులను క్రియేట్ చేస్తే ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోతాడు అన్న విషయాన్ని ఈ ఫోటో మరోసారి రుజువు చేస్తోంది. ప్రస్తుతం అడవులలో నడుస్తున్న ప్రభాస్ ఫోటో నేటి రోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్..

రాజమౌళి అవార్డు వెనుక టాప్ సీక్రెట్..?!!

రాజమౌళి అవార్డు వెనుక టాప్ సీక్రెట్..?!! Share on Pinte Share on Reddit Share on Google Share on Linkedinhttps://www.facebook.com/weloveprabhas.blogspot.in/?ref=tn_tnmn
భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పుర్కారాలు పద్మశ్రీ,పద్మభూషన్, పద్మ విభూషన్. సినీ,క్రీడా,సామాజిక సేవా వివిధ రంగాల్లో సేవ చేసినందుకు గాను వారి సేవలు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించినందుకు గాను ఈ అవార్డులు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో దర్శకధీరుడు రాజమౌళికి అవార్డు వచ్చిందీ అనగానే బాహుబలి చిత్ర యూనిట్ ఎగిరి గంతేసింది. తెలుగు దర్శకుడు అందులోనూ అందరి అభిమానాన్ని సంపాదించిన రాజమౌళికి రావడం అనేది టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో గర్వ పడుతుంది.

మొదటి నుంచి విభిన్నమైన చిత్రాలు తీస్తూ అద్భుతమైన గ్రాఫిక్ టెక్నాలజీతో సినిమాలు తీస్తూ..ఓటమి ఎరుగుని దర్శకుడిగా రాజమౌళి తెలుగు ప్రేక్షకులు గుండెల్లో నిలిచి పోయారు. తాజాగా రాజమౌళికి ‘పద్మశ్రీ’ అవార్డు రావడం వెనుక ఓ పెద్ద ట్విస్టే ఉందట. వాస్తవానికి ఈ అవార్డు రావడం వెనుక మన తెలుగు రాష్ట్రాల ప్రమేయం ఏమాత్రం లేదట..వాస్తవానికి కళా,క్రీడలకు సేవలందించిన వారి పేర్లు ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తుంటాయి.


            రాజమౌళి అవార్డు వెనుక టాప్ సీక్రెట్..?!!
కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళికి మాత్రం పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి ఈ రికమండేషన్ వెళ్లిందట..అలా ఆయనకు అవార్డు దక్కడంలో ఆ రాష్ట్రం ప్రముఖ పాత్ర వహించిందట. ఇక దీనికో కారణం కూడా ఉంది..గతంలో రాజమౌళి కన్నడంలో  ‘కంటీరవ' అనే సినిమా చేశారు. అప్పట్లో ఆ సినిమా బాగా ఆడినా రాజమౌళికి మాత్రం పెద్దగా పేరు రాలేదు. కానీ ‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 

Monday, January 25, 2016

రజనీ, రామోజీ, రాజమౌళిలకు పద్మ అవార్డులు


rajini
భారత ప్రభుత్వం ప్రకటించే అత్యుత్తమ అవార్డుల్లో ‘భారత రత్న’ తరువాతి స్థానమైన ‘పద్మవిభూషణ్’ అవార్డుకు స్టూడియో అధినేత, పాత్రికేయ ప్రముఖులు రామోజీ రావు మరియు సూపర్ స్టార్ రజనీ కాంత్‌లు ఎంపికయ్యారు. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు గానూ రామోజీకి భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించగా, సినీ పరిశ్రమకు నటుడిగా సేవలందించినందుకు గానూ రజనీ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది.
ఇక ఇదిలా ఉంటే పద్మ అవార్డుల్లో భాగంగా ప్రకటించే ‘పద్మశ్రీ’ అవార్డుకు దర్శక ధీరుడు రాజమౌళి ఎంపికయ్యారు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన రాజమౌళి, సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గానూ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఇక ఇదే సమావేశంలో క్రీడా, వాణిజ్యం తదితర, వైద్యం తదితర రంగాల్లో సేవలందించిన పలువురికి పద్మ అవార్డులను ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. పద్మ అవార్డులకు ఎంపికైన రజనీ కాంత్, రామోజీ రావు, రాజమౌళిలకు ఈ సందర్భంగా 123తెలుగు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

బాహుబలి వల్లే.. నాన్నకు ప్రేమతో హిట్ అయ్యిందా..!?

సుకుమార్.. జీనియస్ గా పేరున్న తెలుగు దర్శకుడు.. పూర్వాశ్రమంలో లెక్కల మాస్టారైన ఈయన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్.. హిట్ అయినా ఫట్ అయినా సరే. సుకుమార్ సినిమా అంటే ఓసారి చూసి తీరాల్సిందే అనుకునే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. ఫ్లాప్ కు కూడా గౌరవం తెచ్చిన దర్శకుడు సుకుమార్ అని దిగ్గజ డైరెక్టర్లే అంటుంటారు. 

అలాంటి సుకుమార్ ఈ సంక్రాంతి మాంచి హిట్ కొట్టాడు. కొన్నాళ్లుగా హిట్ సినిమా కోసం మొహం వాచిపోయిన ఎన్టీఆర్ కు ఓ హిట్ ఇచ్చారు. నాన్నకు ప్రేమతో.. అంటూ సంక్రాంతి ప్రేక్షకులకు మాంచి ఇంటలిజెంట్ మూవీని అందించారు. టూ మచ్ లాజిక్ గా ఉంది.. అని కొందరు ప్రేక్షకులు కామెంట్ చేసినా.. ఓవరాల్ గా మంచి టాక్ సొంతం చేసుకుందీ సినిమా.

ఐతే.. విచిత్రం ఏంటంటే.. ఈ సంక్రాంతికు ప్రధానంగా పోటీ పడిన నాలుగు సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం. ఇలాంటి పరిణామం చాలా రేర్ గా జరుగుతుంటుంది. దర్శకులంతా సేఫ్ గేమ్ ఆడటంలో సక్సస్ అయ్యారనే చెప్పుకోవాలి. నాన్నకు ప్రేమతోతో సుకుమార్, డిక్టేటర్ తో శ్రీవాస్, ఎక్స్ ప్రెస్ రాజాతో మేర్లపాక గాంధీ, సోగ్గాడే చిన్ని నాయనాతో కల్యాణ్‌కృష్ణ.. నలుగురూ సంక్రాంతికి బాక్సాఫీస్ పంట పండించారు. 


ఈ నాలుగు సినిమాల సక్సస్ వెనుక బాహుబలి పాత్ర ఉందంటూ కామెంట్ చేస్తున్నారు సుకుమార్.. ఈ సినిమాల విజయానికి బాహుబలికి లింకేంటీ అనుకుంటున్నారా.. లింకు ఉందట. ఈ రాజమౌళి సినిమా వల్లే.. కొన్నేళ్ళుగా బయటకు రాని జనాలు ఇళ్ళల్లో నుంచి బయటికొచ్చి సినిమా హాళ్లకు వస్తున్నారట. 

బాహుబలి ఇచ్చిన సపోర్ట్ తోనే అన్ని సినిమాల వసూళ్లు పెరిగాయట. అందుకే థాంక్స్ టు బాహుబలి అంటున్నారు సుకుమార్.  నిజంగా ఇలాంటి కామెంట్ చేసిన సుకుమార్ ఔన్నత్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదా.

Monday, January 4, 2016

విక్రమ్ మాటలకు పడిపోయిన ప్రభాస్ !

కోలీవుడ్ టాప్ హీరో విక్రమ్ మాటలకు ప్రభాస్ పడిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ తో కోలీవుడ్ ప్రేక్షకులలో కూడ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రభాస్ విక్రమ్ డైరెక్షన్ లో ఒక పాటలో నటించబోతున్నాడు  అన్న వార్తలు వస్తున్నాయి. హీరో విక్రమ్ చెన్నై వరద బాధితుల కోసం తీస్తున్న 6 నిముషాల వీడియో సాంగ్ లో ప్రభాస్ నటిస్తున్నాడు.

‘స్పిరిట్ ఆఫ్ చెన్నై’ అన్న స్పూర్తితో తయారు చేస్తున్న ఈ పాటలో దక్షిణ భారత దేశానికి చెందిన ఎందరో టాప్ హీరోలు హీరోయిన్స్ ఈ వీడియో సాంగ్ లో కనిపించబోతున్నారు. అయితే టాలీవుడ్ కు సంబంధించి ఈ వీడియో సాంగ్ లో నటించే అవకాశం కోసం ప్రత్యేకంగా ప్రభాస్ కు పిలుపు రావడం అతడి స్థాయిని సూచిస్తోంది.

కోలీవుడ్ టాప్ హీరోలు విజయ్, సూర్యాలతో పాటుగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, మోహన్ లాల్, నిత్యామీనన్, హన్సిక వంటి ఎందరో టాప్ సెలెబ్రెటీలు నటిస్తున్న ఈ వీడియో సాంగ్ షూటింగ్ ఈరోజు నుండి చెన్నైలో ప్రారంభం కాబోతోంది. అయితే వీరందరితో సమానంగా ప్రభాస్ కు పిలుపు రావడమే కాకుండా ప్రభాస్ పై ఈ పాటకు సంబంధించిన ఒక ప్రత్యేక చరణాన్ని చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

తమిళ చానెల్స్ అన్నింటిలోను ప్రసారం అయ్యే ఈ పాట ద్వారా చెన్నై వరద బాధితులకు మరింత సహాయం చేయమని ఈ సెలెబ్రెటీలు అంతా కోరబోతున్నారు. కోలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న ప్రభాస్ కు ఈ అవకాశం అనుకోని ట్విస్ట్ గా మారింది అని అంటున్నారు.. 

Sunday, January 3, 2016

ప్రభాస్ ముగింట వాలిన బాలీవుడ్ ఆఫర్స్ ఇవే...

 

ప్రభాస్ ముగింట వాలిన బాలీవుడ్ ఆఫర్స్ ఇవే
ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన పాపులారిటిని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పవచ్చు. మొన్నటి వరకూ టాలీవుడ్ కే పరిమితం అయిన ప్రభాస్, ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీను మించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బడా స్టార్ గా ఎదిగాడు. అయితే ఈ విషయాన్ని ప్రభాస్ మాత్రం ఒప్పుకోవటం లేడు. కేవలం ఒక్కసిమాతోనే తను ఇండియన్ స్టార్ గా మారటం అనేది కరెక్ట్ కాదనేది ప్రభాస్ వాదన.

ఇదిలా ఉంటే, ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ స్టార్ ఐకాన్ గా నిలిచారు. తెలుగు సినిమా బాలీవుడ్‌లో సత్తా చాటటమే కాకుండా,100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో టాలీవుడ్ సత్తాని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించింది. అంతే కాకుండా ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తోనే మహీంద్ర సంస్థ టీయూవీ 300 వాహనంకు ప్రభాస్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. దీంతో ప్రభాస్ మరింత పాపులర్ అయ్యాడు. నిజానికి ఈ యాడ్ లో షారుఖ్ ని తీసుకోవాలని మహింద్ర సంస్థ చూసింది.

కానీ బాహుబలి పాపులారిటీకి షారుఖ్ ని కాదని ప్రభాస్ ని సెలక్ట్ చేశారు మహింద్ర సంస్థ. ఇక బాలీవుడ్ ఆఫర్స్ విషయానికి వస్తే, బాహుబలి2 తరవాత ప్రభాస్ కాల్షీట్స్ కోసం పలు బాలీవుడ్ చిత్రాలు వెయిట్ చేస్తున్నాయి. ‘ధూమ్ 4’ సినిమాలో ప్రభాస్ కి ఓ రోల్ ధక్కింది. ఈ వివరాలను సరిగ్గా బాహుబలి2 రిలీజ్ సమయంలో రివీల్ చేసేందుకు ప్రభాస్ అంగీకారం తెలిపాడు. అలాగే కరణ్ జోహార్ సొంత ప్రొడక్షన్ లో ప్రభాస్ కి ఆఫర్ వచ్చింది.

గతంలో బాలీవుడ్ లో నటించే ప్రసక్తే లేదన్న ప్రభాస్, తాజాగా“బాహుబలి తర్వాత వేరే ఇతర భాషల నుంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా చేస్తా” అని చెప్పటం ఎంతో విశేషం. ఇక ప్రభుదేవా డైరెక్షన్ లో ఓ మూవీకి ప్రభాస్ హీరోగా చేసే అవకాశం ఉంది. ఇది హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరణ జరపుకోనుంది. దాదాపు 3 నుండి 5 చిత్రాల వరకూ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఆఫర్స్ ప్రభాస్ ముంగిట ఉన్నాయి. వీటిలో ప్రాభాస్ ఏది సెలక్ట్ చేసుకుంటాడు అనేది తన అభిప్రాయం పైనే ఆధారపడి ఉందట.

Wednesday, December 30, 2015

ప్రభాస్! Rolls-Royce. కొత్త కారు అదరహో....

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖరీదైన కొత్త కారు కొన్నాడనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. రోల్స్ రాయిస్‌ సిరీస్‌కి చెందిన ఆ కారు ఖరీదు అక్షరాల 8 కోట్ల రూపాయలట. లగ్జరీ సదుపాయాలన్నీ ఉన్న కారు ఇటీవలే డెలివరీ అయిందట. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ కారు ఇంటిరీయర్ అదిరిపోయేలా ఉందట. అందులోనూ ప్రభాస్ డ్రీమ్  కారు కావడంతో ఫ్రెండ్స్ అందరికీ తన ఫామ్ హౌస్‌లో పార్టీ ఇచ్చినట్లు సమాచారం. పలు టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడార్‌గా వ్యవహారిస్తున్న ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవల మహీంద్రా కంపెనీకి సంబంధించి మహీంద్రా XUV 500 మోడల్ కారుకు ప్రభాస్ బ్రాండ్ అంబాసిడార్‌గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. తాజాగా స్టెటస్‌కు సింబల్‌గా పేరున్న రోల్స్ రాయిస్ టాప్ ఎండ్ మోడల్ కారు కొనుగోలు చేశాడట. టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో అంత అత్యంత ఖరీదైన కారు కొన్న హీరోలుగా మొదట మెగాస్టార్ చిరంజీవి, తర్వాత ప్రభాస్ అని తెలుస్తోంది. తెలుగు పరిశ్రమలో హీరోలందరికీ దాదాపు రేంజ్ రోవర్, జాగోవర్ కార్లే అధికంగా ఉన్నాయి.