Saturday, February 1, 2014

యంగ్ రెబల్ స్టార్ పై వర్మ కన్ను!



ఒకప్పుడు రాంగోపాల్ వర్మను గొప్ప దర్శకుడు అని పొగిడిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన్ను చాలామంది చెత్త సినిమాల దర్శకుడు అని విమర్శిస్తున్నారు. హిట్ బాటలో ఉన్నంతకాలం మంచి పేరు...ఫ్లాపుల బాటలోకి వచ్చాక చెత్తపేరు చిత్ర రంగంలో సాదరణమే. ఇటీవల అటు హిందీలోనూ...ఇటు తెలుగులోనూ రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చి పెట్టాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమాలు చేయాలంటే నిర్మాతలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే అటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. అదేమిటంటే రాంగోపాల్ వర్మ ఓ పొలిటికల్ సెటైర్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఆ సినిమాలో ప్రభాస్ హీరోగా వర్మ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. వర్మ కెరీర్లో మొదటిసారిగా అత్యధికంగా 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాకి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వర్మతో పెద్ద రిస్క్ చేస్తున్న నిర్మాత ఎవరో పక్కకు పెడితే....ప్రభాస్ తన కెరీర్లో వర్మ చేతిలో పెట్టి రిస్క్ చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ అనుష్క రానా తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నది.

No comments:

Post a Comment