Thursday, May 31, 2012

రెండు కోట్లకి 'కోకో కోలా' అంటున్న ప్రభాస్

మిగతా హీరోలంతా రకరకాల ప్రొడక్టులను ఎండార్స్ చేసుకుని బ్రాండ్ ఎంబాసిడర్స్ గా మారుతుంటే ప్రభాస్ కు కూడా ఆ కోరిక పుట్టినట్లుంది. కోకా కోలా ప్రొడక్టుకి బ్రాండ్ ఎంబాసిడర్ గా రీసెంట్ గా సైన్ చేసినట్లు సమాచారం. ఇందునిమిత్తం ప్రభాస్ ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ముంబైలో జరిగిన ఈ ఫోటో షూట్ లో ప్రభాస్ వివిధ గెటప్ లు వేసి చూసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ మేరకు టీవి యాడ్ కోసం షూటింగ్ జరగనుంది. జూలై నెలాఖరు నుంచి కానీ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కానీ టీవిలో టెలికాస్ట్ కానుంది. ఇందు నిమిత్తం ప్రభాస్ కి రెండు కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రెబెల్,వారధి చిత్రాల బిజీలో ఉన్నాడు

No comments:

Post a Comment