Saturday, June 23, 2012

గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసుతో పది లక్షల విరాళం అందజేశారు. నల్గొండలోని ఓ అంధుల పాఠశాలకు ఆయన ఈ విరాళం ప్రకటించాడు. ఆయనే స్వయంగా తన అంకుల్ తో కలిసి అక్కడికి వెళ్లి వారితో గడిపి అనంతరం ఈ డబ్బులు అందజేశారు. సంపాదించుకోవడమే తప్ప దాన గుణం లేని ఈ తరం నటులకు ప్రభాస్ దాతృత్వం నిజంగా ఆదర్శనీయం. అభిమానులు కూడా ప్రభాస్ బాటలో నడిచి తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ రెబెల్ తో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇన్నాళ్లు స్తబ్దుగా నడిచిన రెబల్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్లు కూడా అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో వారధి సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి ప్రభాస్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్నారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెబెల్' చిత్రం విడుదలకు ముందు నుంచే సంచనాలు రేకిస్తూ ముందుకు సాగుతోంది. ప్రభాస్ కెరీర్లోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో ఈచిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఈచిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 5.75 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు త్వరలోలో వెల్లడికానున్నాయి.

No comments:

Post a Comment