Thursday, June 27, 2013


Saturday, June 22, 2013

ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ప్రభాస్ హీరోయిజం


  ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ప్రభాస్ హీరోయిజం!
 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ సినిమా మార్కెట్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. తన టాలెంట్‌తో ఇక్కడ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ త్వరలో ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు పొందబోతున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా......ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిస్థితులు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్, రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి' చిత్రానికి కమిటైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో తెలుగు సినిమా చరిత్రను ఎల్లలు దాటించిన రాజమౌళి....‘ఈగ' చిత్రాన్ని ఇంటర్నేషనల్ సినీ మార్కెట్లో ప్రదర్శించే అవకాశం రావడంతో ఇదే అదునుగా తన తర్వాతి ప్రాజెక్టు ‘బాహుబలి'కి వ్యాపార మార్గాలు వెతుక్కుంటున్నాడు. ప్రస్తుతం ‘ఈగ' చిత్రం షాంఘై ఫిల్మ్ ఫెస్టవల్‌లో ప్రదర్శితం అవుతుండటంతో.....‘బాహుబలి' నిర్మాతలతో కలిసి అక్కడికి వెళ్లిన రాజమౌళి, అక్కడ ఈ సినిమాకు మార్కెట్ బాటలు వేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్లో వెల్లడిస్తూ ట్వీట్ చేసాడు. ‘ఈగ మాకు అంతర్జాతీయ మార్కెట్ లో ఒక స్వల్ప అంతర్దృష్టి ఇచ్చింది. ‘బాహుబలి' చిత్రానికి అంతర్జాతీయ బాటలు వేయడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నాం' అంటూ రాజమౌళి వెల్లడించారు. ‘బాహుబలి' సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్స్‌కు తగిన విధంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు వంద కోట్ల భారీ వ్యయంతో ఈచిత్రాన్ని ఆర్కామీడియా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తియుద్ధం, ధనుర్విద్య, కర్రసాము లాంటి విద్యలను ప్రభాస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. అనుష్క హీరోయిన్ కాగా, రానా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.

Friday, June 21, 2013

ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో 'బహుబలి' ఏమవుతుంది?


Prabhas

రాజమౌళి చిత్రంలో ఏ హీరో చేసినా అది హిట్టే. కానీ అందులో దర్శకుడి ప్రతిభే కన్పిస్తుంది. సహజంగా హీరోకు పేరు రాదు. ప్రభాస్‌తో 'ఛత్రపతి' సినిమా చేశాక... ఆ చిత్రానికి ప్రభాసే కరెక్ట్‌ అని అందరూ అన్నారు. మరే హీరో చేసినా అంత ఎఫెక్ట్‌ వచ్చేది కాదు. కానీ ఆ తర్వాత ప్రభాస్‌కు మరే సినిమా అంత రేంజ్‌లో హిట్‌ కాలేదు. కథ కూడా ఆయనకు దొరకలేదు. రాజమౌళి చిత్రంలో నటిస్తే... ఆ తర్వాత హిట్‌ కోసం నానా తంటాలు పడాల్సింది హీరోనేననే టాక్‌ ఇండస్ట్రీలో ఉంది. దీనికి రామ్ చరణ్, ఎన్‌.టి.ఆర్, సునీల్‌ వంటివారు కూడా ఉదాహరణలే.

అయితే.. ప్రభాస్‌ కోసం మలిచిన బహుబలి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆ పాత్రకు ప్రతినాయకునిగా ఉండే పాత్ర రానా పోషిస్తున్నాడు. ఇద్దరిమధ్య పోరాట సన్నివేశాలు నువ్వా నేనా అనేట్లుగా ఉంటాయని చిత్ర యూనిట్‌ చెబుతుంది. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని తృణంగా పెట్టే బహుబలి పాత్ర ప్రభాస్‌ది.

అలాంటి మాట కోసం ప్రతినాయకుడు కాపు కోసం కూర్చునట్లు కూర్చుని... ప్రజల చేత ప్రాణాల్ని ఇచ్చేలా చేస్తాడట. చాలా ట్విస్టులతో కూడిన ఈ కథను రాజమౌళి ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారని చిత్ర యూనిట్‌ అంటోంది.

Saturday, June 15, 2013


బాహుబలి: మూడు రోజులకు 10 కోట్ల ఖర్చు

Bahubali 10 Cr Expenditure 3 Days  
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రభాస్ హీరోగా ‘బాహుబలి' పేరుతో భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో జానపద చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రం కోసం ఖర్చు పెడుతున్న తీరు ఇండస్ట్రీ వర్గాలను అవాక్కయ్యేలా చేస్తోంది. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో మూడు ప్రత్యేకమైన సెట్లు వేసారు. ఈ ముడు సెట్లలో కేవలం మూడు రోజులు మాత్రమే షూటింగ్ జరుపునున్నారట. ఆ తర్వాత ఇక్కడ చిత్రీకరించిన సీన్లకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ చేయనున్నారు. ఈ మూడు రోజుల షూటింగుకు ఉపయోగించే సెట్లు, ఇతరత్రా ఖర్చులు కలిపి దాదాపు రూ. 10 కోట్ల వరకు వెచ్చిస్తున్నారట. ఎంత బిగ్ బడ్జెట్ సినిమా అయినా మూడు రోజులకు రూ. 10 కోట్ల ఖర్చా? అంటూ అంతా నోరెళ్లబెడుతున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఈ సెట్లకు రూపకల్పన చేసారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. అనుష్క హీరోయిన్ కాగా, రానా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగున్నాయి. http://weloveprabhas.com/


Prabhas's biggest multi starrer movie





Rebel Star Krishnamraju is planning to direct the movie 'Okka Adugu' with Young Rebel Star Prabhas as the hero. According to this veteran star, the movie is going to be the biggest multi-starrer as it will have four lead roles in it. Apart from Prabhas, Krishnamraju will also essay an important role in this movie. Young heroes Nara Rohit and Sharwanand are being considered for other lead roles in this movie. However, they are yet to give their nod to do this movie. The movie will be made on Gopikrishna Movies. Apart from this Prabhas is busy with his upcoming movie ‘Baahubali’. This historical extravaganza will be directed by ace director SS Rajamouli. Keeravani will score the music of the film while Arka Media is producin

Wednesday, June 12, 2013

కృష్ణంరాజు దర్శకత్వంలో ప్రభాస్ వచ్చే ఏడాది పెళ్లి

Krishnam Raju Directs Prabhas  



టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా...అని అభిమానులంతా ఎదురు చూస్తున్న తరుణంలో, ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణం రాజు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. బుధవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ప్రభాస్ వివాహం ఉంటుందని స్పష్టం చేసారు. అంతే కాదు ఆగస్టు నెలలో ప్రభాస్ హీరోగా నిర్మించే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా వారు రాజకీయాల్లో పోటీ గురించి అడగ్గా వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని సమాధానం ఇచ్చారు. ప్రభాస్ ప్రస్తుతం రాజమౌలి దర్శకత్వంలో రూపొందబోయే ‘బాహుబలి' సినిమా కోసం భారీగా గడ్డం, మీసం పెంచేసిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా విడుదల కావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనున్న నేపథ్యంలో దానికంటే ముందు ఓ సినిమా చేయాలనే ప్లాన్లో ఉన్నాడు ప్రభాస్. అందులో భాగంగానే ప్రభాస్...తన పెదనాన్న దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా చేయడం ద్వారా పెదనాన్న కోరిక తీర్చడంతో పాటు, ‘బాహుబలి'కి ముందు మామూలు సినిమా వస్తే....బాహుబలికి బాగా ప్లస్సవుతుందనే ప్లాన్లో ప్రభాస్ ఉన్నాడట. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణంరాజు దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో కూడా ప్రభాస్ భారీ గడ్డం, మీసాలతోనే ఉంటాడని, ఈ చిత్రానికి ‘ఒక్క అడుగు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
http://www.weloveprabhas.com