టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ పెళ్లి ఎప్పుడు
చేసుకుంటారా...అని అభిమానులంతా ఎదురు చూస్తున్న తరుణంలో, ప్రభాస్ పెదనాన్న,
నటుడు కృష్ణం రాజు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. బుధవారం విజయవాడ కనకదుర్గ
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఏడాది ప్రభాస్ వివాహం ఉంటుందని స్పష్టం చేసారు. అంతే కాదు ఆగస్టు
నెలలో ప్రభాస్ హీరోగా నిర్మించే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు
వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా వారు రాజకీయాల్లో పోటీ గురించి అడగ్గా
వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని సమాధానం ఇచ్చారు.
ప్రభాస్ ప్రస్తుతం రాజమౌలి దర్శకత్వంలో రూపొందబోయే ‘బాహుబలి' సినిమా కోసం
భారీగా గడ్డం, మీసం పెంచేసిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా విడుదల
కావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనున్న నేపథ్యంలో దానికంటే ముందు ఓ సినిమా
చేయాలనే ప్లాన్లో ఉన్నాడు ప్రభాస్.
అందులో భాగంగానే ప్రభాస్...తన పెదనాన్న దర్శకత్వంలో సినిమా చేయడానికి
సిద్ధమయ్యారు. ఇలా చేయడం ద్వారా పెదనాన్న కోరిక తీర్చడంతో పాటు,
‘బాహుబలి'కి ముందు మామూలు సినిమా వస్తే....బాహుబలికి బాగా ప్లస్సవుతుందనే
ప్లాన్లో ప్రభాస్ ఉన్నాడట. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం
కృష్ణంరాజు దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో కూడా ప్రభాస్ భారీ గడ్డం,
మీసాలతోనే ఉంటాడని, ఈ చిత్రానికి ‘ఒక్క అడుగు' అనే టైటిల్
పరిశీలిస్తున్నట్లు సమాచారం.
http://www.weloveprabhas.com
http://www.weloveprabhas.com
No comments:
Post a Comment