Tuesday, July 30, 2013

Mirchi - Prabhas Super Rain Fight - 1080p

Monday, July 29, 2013

ప్రభాస్ ‘ఒక్క అడుగు’కు రాజమౌళి గ్రీన్ సిగ్నల్

ప్రభాస్ ‘ఒక్క అడుగు’కు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ 
ప్రభాస్  : ‘మిర్చి' సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి' చిత్రానికి కమిటైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మేరకు సినిమాలో తన పాత్రకు విధంగా తన రూపాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ‘బాహుబలి' మూవీ ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యే అవకాశం లేదు. 
 
ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం పూర్తయి ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. మరో రెండేళ్ల వరకు ప్రభాస్ మూవీ రాదా? అంటూ ఆందోళనలో ఉన్న అభిమానులకు, ప్రభాస్ త్వరలో ‘ఒక్క అడుగు' సినిమా చేయబోతున్నారనే వార్త కాస్త ఊరటనిచ్చింది.
 
 తాజాగా రాజమౌళి కూడా ఈ సినిమా చేయడానికి ప్రభాస్‌కు వెసులు బాటు కల్పించాడని, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వీలైనంత తర్వగా ఒక్క అడుగు మూవీ పూర్తి చేసి మళ్లీ ‘బాహుబలి' షూటింగులో బిజీ కానున్నాడు ప్రభాస్. 
 
ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘ఒక్క అడుగు' చిత్రం కృష్ణం రాజు దర్శకత్వంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. కృష్ణం రాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై ఈచిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమాకు ముందు ఒక్క అడుగు లాంటి సినిమాలు రావడం ప్లస్సవుతుందని సినీ విశ్లేషకులు అంటున్

Friday, July 26, 2013

Prabhas Crossed Mahesh n NTR

Prabhas Crossed Mahesh n NTR


Well, this is not the game of Box Office collections but about the impact a hero can make on a film when it comes to selling of remake rights. Majority of critics said that presence of prabhas was the biggest plus for ‘Mirchi’ rather than the average script and execution of debutant director Koratala Siva. However, producers of Vamsikrishna Reddy and Pramod Uppalapati were lucky enough to rake nearly Rs.1 Crore by selling the Bollywood remake rights to John Abraham.
Before this, it was ‘Pokiri’ of Mahesh Babu, ‘Brindavanam’ of Junior NTR and ‘Vikramarkudu’ of Raviteja stood on top in remake rights market. ‘We cannot disclose the actual amount spent by us in bagging the rights but that is a reasonably good figure,’ said sources close to John Abraham to a media agency. In fact, John liked the most in characterization ofprabhas and this prompted for the remake.



bollywood ke prabhas mirchi movie

Tuesday, July 16, 2013

‘బాహుబలి’ గురించి సుదీప్ ట్వీట్

ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ‘ఈగ' లో కన్నడ నటుడు సుదీప్ కనబరిచిన నటన ప్రేక్షకులతో పాటు విమర్శకులనూ మెప్పించిన విషయం తెలిసిందే. సుదీప్ లేకపోతే ‘ఈగ'ను ఊహించుకోవడం కష్టమే అనేంతగా నటనను ప్రదర్శించి రాజమౌళిని మెప్పించిన సుదీప్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి ‘బాహుబలి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో గెస్ట్ రోల్ లో ఓ కథలో ఓ కీలకమైన మార్పుని తెచ్చే పాత్రను సుదీప్ పోషిస్తున్నట్లు సమాచారం.  
‘బాహుబలి’ గురించి సుదీప్ ట్వీట్
ఈ విషయమై చాలా ఎక్సైట్ మెంట్ తో సుదీప్ ఉన్నారు. తన ఆనందాన్ని సుదీప్ తన ట్విట్టర్ పేజీ లో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ‘బాహుబలి’ గురించి సుదీప్ ట్వీట్ సుదీప్ సుదీప్ ట్వీట్ చేస్తూ..." బాహుబలి షూటింగ్ ఖచ్చితంగా ఓ మంచి ఎక్సపీరియన్స్ , చాలా అద్బుతమైన సెట్స్, మంచి టీమ్ , రాజమౌళి గారితో మళ్లీ పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలతో ట్వీట్ చేస్తాను ." అన్నారు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రానాతో పాటు ‘పంజా' ఫేమ్ అడివి శేష్ నటించనున్నాడు. వీరితో పాటు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సుదీప్ నటించనున్నాడని, ఆయన పాత్ర నిడివి చిన్నదే అయినా చాలా ప్రాధాన్యత వుంటుందని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ‘arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

Tuesday, July 9, 2013


మగధీర' రికార్డ్ 'బాహుబలి' బ్రేక్ చేస్తుందా....




టాలీవుడ్ చిత్ర పరిశ్రమ చరిత్రలో 'మగధీర' రికార్డులన్నీ బ్రేక్ చేసింది. ఈ సినిమా సృష్టించిన రికార్డ్ ను ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా క్రాస్ చేయలేకపోయింది. ప్రతి సినిమాని విభిన్నంగా చూపించే దర్శకుడు రాజమౌళి ఆ తర్వాత 'మర్యాద రామన్నా' 'ఈగ' వంటి సినిమాలు రూపొందించిన ఆ సినిమాలు మగధీర రికార్డ్స్ ని మాత్రం బ్రేక్ చేయలేకపోయాయి. అయితే తన రికార్డ్ ని తనే బ్రేక్ చేయాలనీ అనుకున్నాడెమో రాజమౌళి రాజుల కథ అయిన 'బాహుబలి' ఎంచుకున్నాడు. మగధీర సినిమా సెట్స్ పై ఉన్న సమయంలో ఆ చిత్రానికి 40 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మంచి పబ్లిసిటీ ఏర్పడటంతో అంచనాలు పెరిగి 80 కోట్లు రాబట్టింది. మరి ఇప్పుడు బాహుబలికి అరవై కోట్లు అని రాజమౌళి చెబుతున్నాడు. మరి ఈ సినిమాకు రాజమౌళి ఎంత లాగుతాడో....మగధీర రికార్డ్ ని బ్రేక్ చేసి.... ప్రభాస్ ని మొదటి స్థానంలో నిలబెడుతాడో...లేక మగధీర రికార్డ్స్ నే కంటిన్యూ చేస్తాడో చూడాలి. అయితే బాహుబలి సినిమాని ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులతో పాటు పరిశ్రమలో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు నేలకోన్నాయి. అయితే ఆ అంచనాలు చూస్తుంటే మగధీర రికార్డ్ బ్రేక్ ఖాయం అని అనిపిస్తుంది.

Tuesday, July 2, 2013

రాజమౌళి 'బహుబలి' సినిమా 70 నిమిషాలే... మిగతాదంతా?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రానా ప్రతినాయకుడిగా అందాలభామ అనుష్క హీరోయిన్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న సినిమా 'బహుబలి'. ఈ సినిమా జులై 6 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ మూవీ కోసం 'బహుబ‌లి' చిత్ర యూనిట్ చాలా కష్టబడుతుంది. చారిత్రక నేప‌ధ్యంతో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో అస‌లైన స్టోరి ఎంత‌, సోది ఎంత అనే విష‌యాలపై ఇప్పుడు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

సినిమా మొత్తాన్ని రాజ‌మౌళి క‌త్తులు, యుద్దాల‌తో న‌డ‌ప‌డంలేదట. ఇందులో ఓ 70 నిముషాల పాటు ర‌క్తి క‌ట్టించే నేప‌ధ్య క‌థాంశం ఉంటుంది. మిగ‌తా స్టోరి అంతా తనదైన స్టైల్‌లో లాంగేంచేస్తాడట రాజమౌళి. అయితే ఈ 70 నిముషాల ప‌వ‌ర్‌పుల్ స్టోరిను ఎంటైర్ మూవీ ఎండింగ్ వ‌ర‌కూ ఎమోష‌న‌ల్‌గా కంటిన్యూ చేస్తాడ‌ని చిత్ర యూనిట్ నుండి విశ్వశ‌నీయ వర్గాల స‌మాచారం.