Friday, March 28, 2014

ఉగ్రరూపం దాల్చనున్న ప్రభాస్‌... అతడే కరెక్ట్ అంటూ ఆఫర్..


prabhas


ఉగ్రుడు, రౌద్రుడు వంటి పాత్రలు పోషించగల నటుల్లో కృష్ణంరాజును చెప్పవచ్చు. ఆయన వారసునిగా ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్నాడు. ఛద్రపతిలో అతని టాలెంట్‌ మనం చూసిందే. ఇప్పుడు రాజమౌళి బాహుబలితో మళ్ళీ అంతటి ఉగ్రరూపం చూపించబోతున్నాడు. ఈ చిత్రం ఇంకా ఏడాది పట్టేట్టుంది.

తాజాగా ఓ తమిళ చిత్రం 'ఉగ్రమ్‌' విడుదలైంది. మంచి కలెక్షన్లు కురిపించింది. ఇందులో శ్రీమురళి, హరిప్రియ నటించారు. ఈ చిత్రం రీమేక్‌ చేయడానికి పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. ఈ పాత్రకు ప్రభాస్‌ కరెక్ట్‌ అని భావించారట.

ఈ పాత్ర కోసం ముందుగా వేరే యూత్‌ హీరోను అనుకున్నా... ప్రభాస్‌ ఎత్తు కరెక్ట్‌గా ఎమోషన్‌కు సరిపోతుందని భావించారట. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

No comments:

Post a Comment