మన స్టార్ హీరోలందరూ ఏదో ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ నాలుగు
డబ్బులు వెనకేసుకోవడమే కాక తమ మార్కెట్ ని కూడా పెంచుకుంటున్నారు. ఒక్క
పవన్ కళ్యాణ్ , ప్రభాస్ తప్ప పరిశ్రమలో మిగిలిన వారందరు ఏదో ఒక సంస్థకు
బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నవాళ్ళే , వీళ్ళలో మహేష్ కు ఉన్న డిమాండ్ అంతా
ఇంతా కాదు. ఏకంగా జాతీయ స్థాయిలో కూడా మహేష్ నే బ్రాండ్ అంబాసిడర్ గా
ఎంచుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రభాస్ కూడా ఇటువైపు వస్తున్నట్లు
ప్రచారం జరుగుతున్నది. అసలే ఓ వైపు సర్జరీ మరో వైపు బహుబలితో సతమతమవుతున్న
మళ్ళీ పైన ఈ ప్రచారం కూడానా అనుకుంటూ ప్రభాస్ తనను సంప్రదించిన సంస్థలను
వెనక్కు పంపిస్తూ వచ్చాడట. అయితే సాక్షాత్తు జక్కన్నే ప్రకటన పట్ల ప్రభాస్
ని బలవంతం చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే ప్రకటనలో కనిపిస్తే
ఎంతోకొంత మార్కెట్ పెరుగుతుందని రాజమౌళి వాదన. అది కూడా నిజమే కనుక ప్రభాస్
కూడా ఇప్పుడు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. జక్కన్న తన బాహుబలి
సినిమాని ఎలాగైనా ఇండియాలో అన్ని భాషల్లో విడుదల చేయాలనే తపనలో ఉన్నాడు.
ఇప్పటికే తెలుగు , తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా హిందీ , కన్నడ , మలయాళంలో
కూడా డబ్ చేయాలనీ చూస్తున్నారు. ముందుగా ప్రకటనలతో ఆ బాషలలో కూడా ప్రభాస్
ని పరిచయం అయితే తన సినిమాకి మార్కెట్ ఉంటుందని రాజమౌళి ప్లాన్!
No comments:
Post a Comment