ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా కీలక పాత్రధారి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్నటితో పూర్తైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం యూనిట్ సంప్రదాయబద్దంగా గుమ్మిడికాయ కొట్టే తంతుని నిర్వహించారు. ఇదిగో ఇక్కడ ఆ గుమ్మిడికాయ కొట్టే సీన్ ని చూడవచ్చు. ఈ ఉత్సాహభరితమైన సన్నివేశంలో యూనిట్ మొత్తం పాల్గొన్నారు. చూడండి..ఎంత ఉషారుగా ఉన్నారో. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఊపందుకుంది. త్వరలోనే ఇక టీజర్స్ వచ్చి మనని అలరిస్తాయి.
చిత్రం విడుదల విషయానికి వస్తే...
ఈ చిత్రం విడుదల తేదీ అంటూ రాజమౌళి ప్రకటించినా...అది మారవచ్చు అని మీడియాలో వార్తలు వస్తున్న నేపధ్యంలో మరో విషయం తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా భారీగా హిందీ రైట్స్ ని తీసుకున్న కరుణ్ జోహార్ ...విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ముఖ్యంగా అక్కడ హిందీలో మిగతా పెద్ద సినిమా రిలీజ్ లు..అక్కడ బిజినెస్, సీజన్ వంటి పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని బాహుబలి విడుదల తేదిని కరుణ్ జోహార్ నిర్ణయిస్తారని చెప్పుకుంటున్నారు. నేషనల్ మార్కెట్ పెద్దది కాబట్టి అక్కడా భారీ ఎత్తున విడుదల చేస్తారు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏమీ ఇప్పటివరకూ లేదు.
ఈ సినిమా గురించి ప్రస్తుతం భారత చలన చిత్ర పరిశ్రమ మొత్తం చర్చించుకొంటోంది. 'బాహుబలి'కి సంబంధించి ఏ చిన్న విషయం బయటికొచ్చినా దాని గురించి కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. రాజమౌళి వూహలెప్పుడూ అందనంత ఎత్తులో ఉంటాయి. అందుకే ప్రేక్షకులూ 'బాహుబలి'ని ఆ స్థాయిలోనే వూహించుకొంటున్నారు. వాళ్ల వూహలకు, అంచనాలకూ తగినట్టుగా ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి రెండేళ్లుగా శ్రమిస్తోంది రాజమౌళి బృందం. 'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి 'మహిష్మతి' అనే ఓ రాజ్యాన్ని సృష్టించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఈ చిత్రం జరుపుకుంటోంది. అలాగే ఈ చిత్రం ప్రమోషన్ కోసం 'మార్చింగ్ ఏంట్స్' ని ముంబైలో సంప్రదించారని తెలుస్తోంది.
పోస్టర్ డిజైన్ చేయటంలో ఈ సంస్ద బాలీవుడ్ లో పేరెన్నికగన్నది. అందుకే వీరి దగ్గరకి వెళ్లారని తెలుస్తోంది. ఈ చిత్రం భారీ ప్రాజెక్టు కావటంతో అన్ని జాగ్రత్తలూ తీసుకుని చేస్తున్నారు.
ఈ చిత్రంలో నోరా ఫతేహీ ఐటం సాంగ్ చేయనుందని సమాచారం. ఈ మేరకు ఆమె ఇఫ్పటికే ఐదరాబాద్ చేరుకున్నానని, మరో పాట చేస్తున్నానని ట్వీట్ చేసింది. ఇక ఈమె ఇంతకుముందు టెంపర్ లో చేసింది.అలాగే ఈ చిత్రంలో మరో ఐటం గర్ల్...స్కార్లెట్ విల్సన్ కూడా ఐటం సాంగ్ చేస్తోందని వినికిడి. ఈమె గతంలో పూరి దర్సకత్వంలో పవన్ హీరోగా వచ్చిన కెమెరామెన్ గంగతో చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. ఈ లండన్ సుందరి అందచందాలు బాహుబలిలోనూ మెరవనున్నాయి. వీరిద్దరుతో పాటు... రవితేజ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన దేముడు చేసిన మనుష్యులు చిత్రం ప్లాప్ అయినా అందులో గాబ్రియల్ అనే జర్మనీ మోడల్ చేసిన ఐటం సాంగ్ డిస్ట్రబ్ చేస్తన్నాడే పాట నిజంగానే డిస్ట్రబ్ చేసింది.ఈ పాటలోని గాబ్రియల్ ని బాహుబలిలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక మే 15న ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నామని రాజమౌళి అధికారికంగా తెలియజేశాడు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాన్ని బట్టి...విజువల్ ఎఫెక్ట్ లకు లేటవుతుందని, రిలీజ్ తేదీ మారుతుందని చెప్పుకుంటున్నారు. ఆ రిలీజ్ డేట్ సైతం జూలై 30, 2015 అంటున్నారు. అయితే ఇది నిజమా,కాదా అన్నిది తెలియాలంటే అధికారిక ప్రకటన వెలవడాల్సిందే. అయితే రాజమౌళి మాటతప్పే అవకాసం లేదని ఆయన అభిమానులు అంటున్నారు.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ గురించి అన్ని చోట్లా చర్చ మొదలైంది. ఈ రైట్స్ ఎంతకు వెళ్తాయి...ఎవరు తీసుకోనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను రెండు పార్ట్ లు కలిపి 25 కోట్లకు రేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జెమినీ, మా టీవి, జీ తెలుగు ఈ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ రైట్స్ ఎవరికి వారే దక్కించుకోవాలనే ఆలోచనతో ఈ నిర్మాతలను కలుస్తున్నట్లు సమాచారం. అయితే 25 కోట్లు వెచ్చిస్తే ఆదాయం ఆ స్ధాయిలో ఉంటుందా అనేదే వారి సందేహం. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ పెద్ద తెరపై ఈ సినిమాని అందరూ చూసేస్తారు కదా...రాజమౌళి వంటి దర్సకుడు తీస్తున్న సినిమాని,టీవిల్లో వచ్చేదాకా ఎవరు ఆగుతారు అని అంటున్నారట. అయితే బాహుబలి ..టీవిలో వేస్తుంటే తమ ఛానెల్ కు వచ్చే పాపులారిటీని వేరు కాబట్టి బేరమాడో మరొకటి చేసే ఈ రైట్స్ దక్కించుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
మగధీరతో తెలుగు చలన చిత్ర చరిత్రను తిరగరాసిన ఈ రాజమౌళి ..ఇప్పుడు రాజుల కాలంనాటి కథను ఎంచుకున్నాడు. ప్రభాస్ హీరోగా, అనుష్క షెట్టి హీరోయిన్ గా గత రెండు సంవత్సరాలుగా రూపొందుతున్న చిత్రం బాహుబలి. రాజుల కాలం నాటి కథ కావటంతో తీవ్రంగా శ్రమించి రూపొందించారు. ప్రభాస్, రాణా, అనుష్కల పుట్టినరోజుల సందర్భంగా ఒక్కో ట్రైలర్ విడుదల చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేలా, ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా చూసుకున్నాడు రాజమౌళి.
బాహుబలి విడుదలకి సంబంధించి రోజుకో వార్త మీడియాలో హల్ చల్ దరిమిళ ఈ ఊహాగానాలకు తెరదించుతూ దర్శక ధీరుడు రాజమౌళి ఒక వీడియో మెస్సేజ్ ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. బాహుబలికి సంబంధించిన ఒక్క పాట మాత్రమే మిగిలి ఉందని ఎట్టకేలకు షూటింగ్ మరియూ టాకీ పార్టు పూర్తి చేశామని రాజమౌళి సోషల్ మీడియాలో వెల్లడించాడు. గత రెండు సంవత్సరాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్, రాణా, అనుష్క, తమన్న , నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మళయాళీ, హిందీ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బాహుబలి రెండు బాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
అయితే బాహుబలి పార్ట్ 2 విడుదల ఎప్పుడనేది మాత్రం రాజమౌళి చెప్పలేదు. అయితే తొలి బాగానికి రెండవ బాగానికి గ్యాప్ తక్కువగా ఉండాలని, గ్యాప్ ఎక్కువగా ఉంటే కథలోని ఫీల్ మిస్సవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. 'బాహుబలి 2' ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. పాటల్ని ఏప్రిల్ ద్వితీయార్ధంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'బాహుబలి'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది.
మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు..........weloveprabhas.blogspot.in

No comments:
Post a Comment