Tuesday, June 2, 2015

బాహుబలి టీమ్ ట్విట్టర్ ఇంటర్వ్యూ.. మీ కోసం

Bahubali  Stars Twitter interview summary

రాజమౌళి అకుంఠిత దీక్షతో గత మూడు సంవత్సలుగా చెక్కుతున్న బాహుబలి ట్రైలర్ ట్విట్టర్‌లో విడుదల చేశారు.ఈ సందర్భంగా అభిమానుల ప్రశ్నలకు బాహుబలి, బళ్లాలదేవ, అవంతిక, దేవసేనలు సమాధానాలిచ్చారు. ముందే చెప్పినట్టు 5 గంటలకు ట్రైలర్ విడుదల చేశారు. ఆ నలుగురి ట్విట్టర్ ఇంటర్వ్యూ మీకోసం..
బాహుబలిలో మీరు చేసిన రెండు పాత్రల్లో మీకు నచ్చిన పాత్ర..
రెండు పాత్రలూ ఇష్టం.. బాహుబలి పాత్రకు ఎక్కువ కనెక్టయ్యా..
రెండు పాత్రలకోసం ఫిజిక్ ఎలా మెయిన్‌టైన్ చేశారు.
(ప్రభాస్‌ను అడిగిన ప్రశ్నకు అనుష్క సమాదానమిస్తూ ) రెండున్నర సంవత్సరాలు జిమ్‌లో కష్టపడి, డైట్ సరిగ్గా పాటించాడు.
250రోజులూ ప్రభాస్, రానాలను చూస్తుంటే బోర్‌గా అనిపించలేదా..
తమన్నా నేను సంవత్సరం మాత్రమే వర్క్ చేశాను.. అనుష్కను అడిగితే చెబుతుంది
అనుష్క .. ఇప్పుడే చెప్పలేను.. ఇంకా పార్ట్ 2 షూటింగ్ పెండింగ్‌లో ఉందంటూ చెప్పింది.
ప్రభాస్.. డార్లింగ్ మీ పెళ్లెప్పుడు
తొందర్లో.. ఓ మంచి రోజు అంటూ సమాధానమిచ్చాడు ప్రభాస్,, అనుష్క కలగజేసుకుని రానా తరువాతంటూ జవాబిచ్చింది. తమన్నా రానాను పెళ్లెప్పుడంటూ అడిగింది.. దానికి రానా నన్నెవరూ పెళ్లి చేసుకోవటానికి రెడీగా లేరంటూ సమాధానమిచ్చాడు(నవ్వుతూ)
స్వీటీ కన్నడ మూవీలో నటిసారా
స్క్రిప్టు నచ్చితే తప్పకుండా చేస్తానని కన్నడలోనే చెప్పింది స్వీటీ
బాగా ఇబ్బందిపడ్డ క్షణం
అనుష్క చెప్పలేని పరిస్థితి అంటే… షాట్ ఓకే అయినా ప్యాకప్ చెప్తారనుకుంటే ప్యాకప్ చెప్పలేదంది తమన్నా.. యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు వీల్ చేర్‌కి పరిమితం కావడం అంటూ రానా చెప్పగా, అన్ని యాక్షన్ సీన్స్‌లో ఇబ్బంది పడ్డా అంటూ ప్రభాస్ చెప్పాడు.
ప్రభాస్, అనుష్కల మీద మీ అభిప్రాయం
వారి పేర్లే డార్లంగ్, స్వీటీ.. వారి పేర్లదగ్గట్టే వారు అంటూ చెప్పింది తమన్నా..
బాహుబలికి కట్టుబడి ఉండటానికి కారణం
రాజమౌళి లాంటి దర్శకుడు స్క్రిప్ట్ అని అనుష్క, రాజమౌళి కోసమే అంటూ తమన్నా,, ఇండియాలో తొలిసారిగా రూపొందిస్తున్న చిత్రం కావడం, ఇంకా ప్రభాస్ కోసం అంటూ రానా చెప్పాడు. అందరూ బాగా చెప్పారు నావి కూడా అవే సమాధానాలంటూ నవ్వులు పూయించాడు.
రెండున్నర సంవత్సరాల విలువైన సమయం.. రిస్కనిపించలేదా
నో.. రిస్కనిపించలేదు బాహుబలి కోసం ఏమైన చేయొచ్చు అంటూ చెప్పాడు ప్రభాస్
బాహుబలిలో అద్భుతంగా నటించిందెవరూ
తమన్నా, అనుష్క రమ్యకృష్ణ పేరు చెప్పగా,, బళ్లాల దేవా అంటూ రానా చెప్పాడు. వరుసగా అందరి పేర్లు చెప్పాడు ప్రభాస్..
మీరు ఎవరికి ఈ సినిమా చూపించాలనుకుంటున్నారు..
అనుష్క, ప్రభాస్ రజనీకాంత్‌పేరు చెప్పారు. అమితాబ్‌కంటూ రానా,.. తనే ముందు చూడాలని తమన్నా చెప్పింది.
బాహుబలి సెట్‌లో బాగా అల్లరి చేసేదెవరు
అందూ ముక్తంకంటంతో చెప్పే పేరు రానా…

No comments:

Post a Comment