తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘బాహబలి’ ప్రపంచం గర్వించ దగ్గ చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు అహర్శిశలూ కష్టపడితీసిన చిత్రం. తెలుగు చలన చిత్ర సీమలో కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగించింది. ఇక రూ.600 కోట్లు వసూళ్లు చేసి భారతీయ చిత్రాలో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ‘బాహుబలి 2’ త్వరాలో సెట్స్ మీదకు రాబోతుంది..ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు రాజమౌళి.
బాహుబలి పార్ట్ -3 గురించి దర్శకధీరుడు రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యచేశారు. ఇప్పటి వరకు బాహుబలి కోట్లాది ప్రజలను ఆకర్షించింది. తాను ఈ కథకు రైటర్ గా ఉండటం అదృష్టమని అన్నారు. అయితే బాహుబలి 2 తో పాటు బాహుబలి 3 కూడా ఉంటుందని అన్నారు. కాకపోతే బాహుబలి, బాహుబలి 2 కి ఏ మాత్రం సంబంధం లేని కథతో ఇది ఉంటుందని వివరించారు. బాహుబలి కన్క్లూజన్ లో పార్ట్-1 లో మిగిల్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆయన అన్నారు.
బాహుబలి సినిమాకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన రావడంతో బాహుబలి 2 పై ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారని ఈ సినిమా మరిన్ని క్యారెక్టర్లతో అద్భుతంగా అందరినీ అలరిస్తుందని అన్నారు. సినిమాలకు స్క్రిప్ట్ ను అందించడం నా బాధ్యత ప్రస్తుతం 40 స్క్రిప్టులు రెడీ చేస్తున్నాను. ఇక పోతే తాను ఇలాంటి కథలు రాస్తూనే ఉంటానని అందులో కొన్ని మాత్రమే వెండితెరకు పరిచయం అవుతాయని అన్నారు.
No comments:
Post a Comment