యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖరీదైన కొత్త కారు కొన్నాడనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. రోల్స్ రాయిస్ సిరీస్‌కి చెందిన ఆ కారు ఖరీదు అక్షరాల 8 కోట్ల రూపాయలట. లగ్జరీ సదుపాయాలన్నీ ఉన్న కారు ఇటీవలే డెలివరీ అయిందట. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఈ కారు ఇంటిరీయర్ అదిరిపోయేలా ఉందట. అందులోనూ ప్రభాస్ డ్రీమ్ కారు కావడంతో ఫ్రెండ్స్ అందరికీ తన ఫామ్ హౌస్‌లో పార్టీ ఇచ్చినట్లు సమాచారం. పలు టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడార్‌గా వ్యవహారిస్తున్న ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవల మహీంద్రా కంపెనీకి సంబంధించి మహీంద్రా XUV 500 మోడల్ కారుకు ప్రభాస్ బ్రాండ్ అంబాసిడార్‌గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. తాజాగా స్టెటస్‌కు సింబల్‌గా పేరున్న రోల్స్ రాయిస్ టాప్ ఎండ్ మోడల్ కారు కొనుగోలు చేశాడట. టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో అంత అత్యంత ఖరీదైన కారు కొన్న హీరోలుగా మొదట మెగాస్టార్ చిరంజీవి, తర్వాత ప్రభాస్ అని తెలుస్తోంది. తెలుగు పరిశ్రమలో హీరోలందరికీ దాదాపు రేంజ్ రోవర్, జాగోవర్ కార్లే అధికంగా ఉన్నాయి.
Wednesday, December 30, 2015
Wednesday, December 2, 2015
బాహుబలి @ 150.. ఇదీ యూట్యూబ్ లెక్క
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ఇప్పుడు ఆన్ లైన్ లోకి వచ్చేసింది. బాహుబలిని హై రిజొల్యూషన్ 4కే వెర్షన్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. కాకపోతే దీన్ని చూడ్డానికి కొంత ఖర్చవుతుంది. అంతే కాదు పైరసీని అడ్డుకునేందుకు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.
"బాహుబలి ది బిగినింగ్" తెలుగు తమిళ్ మళయాళ వెర్షన్లను.. యూట్యూబ్ లో పెయిడ్ వీడియోగా అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా సరే 150 ఇచ్చి ఈ చిత్రాన్ని చూడచ్చు. అదే ఫారిన్ కరెన్సీలో రెండున్నర డాలర్లు చెల్లించాలి. పేమెంట్ చేశాక 30 రోజుల్లో చూడాల్సి ఉంటుంది. కానీ ఒకసారి చూడడం మొదలుపెట్టాక 48 గంటల్లో చూసేయాలన్నది నిబంధన. ఆ తర్వాత వారికిచ్చిన కోడ్ ఎక్స్ పైర్ అయిపోతుంది. అలాగే యూట్యూబ్ లో ఉన్నంత మాత్రాన.. బాహుబలిని డౌన్ లోడ్ చేసేసుకోవచ్చు అనుకుంటే పొరపాటే. ఇది కేవలం చూడ్డానికి మాత్రమే పరిమితం. అది కూడా యూట్యూబ్ లో మాత్రమే చూడాలి. వేరే చోట షేర్ చేసి చూసే అవకాశం లేదు.
అంతే కాదు.. దీన్ని కాపీ చేసేందుకు డౌన్ లోడ్ చేసుకునేందుకు అప్ లోడ్ చేసేందుకు ఆస్కారం లేదు. మొత్తానికి బాహుబలి కోసం బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు. చూద్దాం.. పైరసీదారులు ఎలాంటి టెక్నిక్స్ కనిపెడతారో.

Subscribe to:
Posts (Atom)