Wednesday, December 2, 2015

బాహుబలి @ 150.. ఇదీ యూట్యూబ్ లెక్క

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ఇప్పుడు ఆన్ లైన్ లోకి వచ్చేసింది. బాహుబలిని హై రిజొల్యూషన్ 4కే వెర్షన్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. కాకపోతే దీన్ని చూడ్డానికి కొంత ఖర్చవుతుంది. అంతే కాదు పైరసీని అడ్డుకునేందుకు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.

"బాహుబలి ది బిగినింగ్" తెలుగు తమిళ్ మళయాళ వెర్షన్లను.. యూట్యూబ్ లో పెయిడ్ వీడియోగా అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా సరే  150 ఇచ్చి ఈ చిత్రాన్ని చూడచ్చు. అదే ఫారిన్ కరెన్సీలో రెండున్నర డాలర్లు చెల్లించాలి. పేమెంట్ చేశాక 30 రోజుల్లో చూడాల్సి ఉంటుంది. కానీ ఒకసారి చూడడం మొదలుపెట్టాక 48 గంటల్లో చూసేయాలన్నది నిబంధన. ఆ తర్వాత వారికిచ్చిన కోడ్ ఎక్స్ పైర్ అయిపోతుంది.  అలాగే యూట్యూబ్ లో ఉన్నంత మాత్రాన.. బాహుబలిని డౌన్ లోడ్ చేసేసుకోవచ్చు అనుకుంటే పొరపాటే. ఇది కేవలం చూడ్డానికి మాత్రమే పరిమితం. అది కూడా యూట్యూబ్ లో మాత్రమే చూడాలి. వేరే చోట షేర్ చేసి చూసే అవకాశం లేదు.

అంతే కాదు.. దీన్ని కాపీ చేసేందుకు డౌన్ లోడ్ చేసుకునేందుకు అప్ లోడ్ చేసేందుకు ఆస్కారం లేదు. మొత్తానికి బాహుబలి కోసం బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు. చూద్దాం.. పైరసీదారులు ఎలాంటి టెక్నిక్స్ కనిపెడతారో. 

No comments:

Post a Comment