Friday, January 18, 2013

'బాహుబలి' సినిమాకి 80 కోట్లు






'ఈగ'  సినిమా తో తన సత్తా చాటిన రాజమౌళి ఇప్పుడు ప్రభాస్ తో 'బాహుబలి' గా ఓ సినిమా చేసే పనిలో ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపధ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమా 'చత్రపతి' 'మగధీర' లు కలిసినట్టు గా ఉంటుందని ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రాజమౌళి. ఈ సినిమా బడ్జెట్ 80 కొట్లాట. ప్రభాస్ పై ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఓ సాహసమే అంటున్నారు కొందరు. తెలుగు చిత్ర సీమలో ఇంత అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే అని సమాచారం.ఇంత భారీ బడ్జెట్ తో సినిమా చేయటానికి ముఖ్యంగా రాజమౌళి పై ఉన్న నమ్మకమే. ఇందులో ప్రభాస్- రానా లు సవతి సోదరుల్లా కనిపిస్తారని తెలిసింది. ప్రభాస్ తన కాల్షీట్లను దాదాపు గా రెండేళ్ళు ఈ సినిమాకే కేటాయిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి సంబందించిన 40 శాతం సన్నివేశాలు బ్లూమోట్ లో చిత్రీకరిస్తున్నారు. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగేస్తుందో చూడాలి.

No comments:

Post a Comment