యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న
చిత్రం 'బాహుబలి'. ఆమధ్య ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ గాయపడినట్లు
ప్రచారం జరింగింది. కానీ ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ప్రభాస్ ఎంతో
ఆరోగ్యంగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం
ప్రకారం...వారు ప్రభాస్ గాయపడిన విషయాన్నీ ఖండిస్తున్నారు. అంతేకాక ప్రభాస్
ఎంతో యాక్టివ్ గా ఈ సినిమా షూటింగుల్లో పల్గొంతున్నట్లు తెలిపారు. అంతేకాక
అసలు ఈ పుకారు ఎలా పుట్టుకొచ్చిండో తెలియడం లేదని అంటున్నారు. ప్రభాస్ -
రానాలు అన్నాతమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క - తమన్నా హీరోయిన్లుగా
నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని ఆర్కా మీడియా పతాకంపై శోభు
యార్లగడ్డ నిర్మిస్తున్నాడు. అయితే 2015 లో విడుదల కానున్న ఈ సినిమా రెండు
భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అటు సినీ
ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నది.
No comments:
Post a Comment