Tuesday, February 11, 2014

ప్రభాస్ కు నిశ్చితార్ధం జరిగిందా !



తెలుగులో మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ జాబితాలో గోపీచంద్ ప్రభాస్ ఉండేవారు. గోపీచంద్ పెళ్లి జరిగిపోవడంతో ప్రభాస్ ఒక్కడే మిగిలిపోయాడు. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పెళ్లి కొడుకు కాబోతున్నట్లు ఆమధ్య కృష్ణం రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య ప్రభాస్ కొసం ఓ అమ్మాయిని చూశారని భీమవరం అమ్మాయి అని ప్రచారంజరిగింది. అయితే ఇప్పుడు ఎక్నగా ప్రభాస్ కు నిశ్చితార్ధం కూడా జరిగిందని ఫిల్మ్ నగర్లో మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ విషయం పై నుంచి ఒక్కరు కూడా ప్రభాస్ ఫ్యామిలీ  నుంచి కానీ సినిమా వర్గాల నుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ప్రభాస్ ఫ్యామిలీ దగ్గరి బంధువుల అమ్మయితోనే ఎంగేజ్ మెంట్ అత్యంత నిరాడంబరంగా కేవలం సన్నిహితుల మధ్యనే జరిగిందని త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఘనంగా ఏర్పాటు చేయనున్నారని దానికి సంబందించిన తేది అఫీషియల్ గా ప్రకటన రానున్నది. అయితే అధికారికంగా సమాచారం లేని ఈ వార్తలను నమ్మాలో వద్దో అర్ధం కాక అభిమానులు తికమకపడుతున్నారు.

No comments:

Post a Comment