Thursday, March 19, 2015

ప్రభాస్ సరసన రాశిఖన్నా


తన అందాలతో అటు కుర్ర హృదయాలను ఇటు సినీ జనాలను కట్టిపడేసింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. తాజాగా ఈ ఢిల్లీ బ్యూటీ నటిస్తున్న చిత్రం ‘జిల్’. ఈ సినిమాతో తనలోని అసలైన టాలెంట్ ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది….ఇప్పటికే విడుదలైన ‘జిల్’ ట్రైలర్స్ చూస్తుంటే… అమ్మడు అందాలు ఆరబోసినట్లు తెలుస్తోంది. హీరో గోపించంద్ తో రాశీ రొమాన్స్ సినిమాకు పెద్ద హైలైట్ అని చిత్రం బృందం సైతం తెగ ఊబ్బేస్తోంది.

దీంతో ఈ క్రేజ్ ను ఇప్పటి నుంచే క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయిన ఢిల్లీబెల్లీ ఎక్స్ పోజింగ్ కు, లిప్ లాకులకు రెడీ అంటూ దర్శక-నిర్మాతలకు హింట్ ఇచ్చేసింది…. అమ్మడి ఆఫర్ ను తొలుత యంగ్ రెబెల్ స్టారే అందుకునేట్టు కనిపిస్తున్నాడట. ఇటీవల జరిగిన ‘జిల్’ ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రభాస్, రాశీ ఖన్నా అందానికి ఫిదా అయిపోయాడట.

అందంతో పాటూ నటన పరంగానూ అమ్మడు మంచి మార్కులే వేయించుకునన ఈ ముద్దుగుమ్మకు తన తదుపరి సినిమాలో ఆఫర్ ఇచ్చేట్టే కనిపిస్తున్నాడు బాహుబలి హీరో� అమ్మడి ఒడ్డూ పొడుగూ కూడా యంగ్ రెబల్ స్టార్ కి సరిగ్గా సరిపోతాయి. ఇదంతా గమనిస్తున్న టాలీవుడ్ బాబులు ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో రాశీ ఖన్నా హీరోయిన్ గా కన్ఫామ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు… అదే జరిగితే రాశీ దశ తిరిగినట్టే…! మరి అమ్మడి లక్ ఎలా ఉందో తెలియాలంటే… మరి కొద్ది రోజులు ఆగాల్సిందే!

No comments:

Post a Comment