Thursday, September 8, 2016

బాహుబలి2 ఓవర్సీస్ బిజినెస్ దెబ్బకి బాలీవుడ్ షాక్







దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఆ నిర్మాతలు మాత్రమే కాకుండా…ఈ మూవీతో బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరూ భారీగా లాభాలను చూసిన వాళ్ళే. ముఖ్యంగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అతి పెద్ద ప్రొడక్షన్ సంస్థ ధర్మ ప్రొడక్షన్…ఈ మూవీని హిందీలోనూ, ఇతర ఫారిన్ లాంగ్వేజ్ లలోనూ రిలీజ్ చేసింది. దీని కారణంగా కరణ్ జోహర్ దాదాపు 150 కోట్ల రూపాయల లాభాలను చూశాడు.
కరణ్ జోహార్ ఈ మూవీపై ఖర్చు పెట్టింది 30 కోట్ల రూపాయలలోపే. ఇదిలా ఉంటే ‘బాహుబలి – ది బిగినింగ్’ విడుదలై ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు బాహుబలి2 చిత్ర షూటింగ్ ని జరుపుకుంటుంది. దీంతో బాహుబలి2 పై ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. బాహుబలి2 బిజినెస్ ని దాదాపు 8 ప్రొడక్షన్ హౌస్ లకి మార్కెట్ చేయాల్సిందిగా నిర్మాతలు పనులని అప్పజెప్పారనే టాక్స్ తెలుస్తున్నాయి.

            బాహుబలి2 ఓవర్సీస్ బిజినెస్ దెబ్బకి బాలీవుడ్ షాక్
వీరు ఇప్పటికే బాహుబలి2ని దాదాపు 300 కోట్ల రూపాయల మేరబిజినెస్ చేయగలిగారు. బాహుబలి2 కి సంబంధించిన థియోట్రికలర్ ట్రైలర్ ఒక్కసారి మార్కెట్ లోకి వచ్చిందంటే…మరో 150 కోట్ల రూపాయల బిజినెస్ అవలీలగా జరుగుతుందని అంటున్నారు. అయితే ఈ మొత్తం బిజినెస్ లో ఓవర్సీస్ మార్కెట్ విలువ 170 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ ని చూసుకుంటే దాదాపు 1000 కోట్ల రూపాయలను టచ్ చేస్తుందనే నమ్మకం చిత్ర యూనిట్ లో గట్టిగానే ఉంది.
ఇక తాజాగా 15 ఫారిన్ బ్లాక్ బస్టర్స్ లిస్టులో 12వ స్థానంలో బాహుబలికి చోటు దక్కటం జరిగింది. దక్షిణభారత సినిమాల్లోని బాహుబలి అపూరూప చిత్రంగా కొనియాడబడింది. వసూళ్ల విషయంలో ఇండియాలో మొదటి స్థానంలోనూ, ప్రపంచవ్యాప్తంగా మూడవ భారతీయ చిత్రంగాను నిలబెట్టాయి’ అంటూ ప్రసంశలను అందుకుంది. ఓవర్సీస్ లో ఈ మూవీ 170 కోట్లరూపాయల బిజినెస్ ని చేసుకోవటంతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. ఇప్పటి వరకూ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రి రిలీజ్ ఓవర్సీస్ బిజినెస్ 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ చేసుకున్న మూవీ ఏదీ లేదు. ఇప్పుడు ఆ రికార్డ్స్ ని బాహుబలి2 తుడిపెట్టిందని అంటున్నారు.

No comments:

Post a Comment