Friday, July 13, 2012

హెలికాప్టర్లో ‘రెబెల్’ ప్రభాస్ ఫైట్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘రెబెల్'. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకున్న ఈచిత్రం ప్రస్తుతం ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.
ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్న ఈ ఫైట్ సన్నివేశాల్లో ప్రత్యేకమైన హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ప్రభాస్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజిలో ఉంటాయి. అతని బాడీలాంగ్వేజ్‌కి తగిన విధంగా కేక పుట్టించేలా రామ్ లక్ష్మణ్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.
read more......

చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ నెలలోనే ఆడియో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈచిత్రం ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభాస్ ఈచిత్రంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా నటిస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. ఈచిత్రానికి తొలుత ‘వారధి' అనే టైటిల్ పేరు వినిపించినా... 'రుద్ర'గా మార్చటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అనూష్కతో పాటు మరో హీరోయిన్ గా రిచా గంగోపాధ్యాయ నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ నిర్మాతలు.

No comments:

Post a Comment