Tuesday, July 24, 2012

ప్రభాస్ ప్రాజెక్టులపై రాజమౌళి వివరణ


‘ఈగ' చిత్రం భారీ విజయం సాధించడంతో దర్శకుడు రాజమౌళి ఆ చిత్రానికి సీక్వెల్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడని, నిర్మాతలు కూడా సీక్వెల్‍‌పై ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై రాజమౌళి స్పందించారు. ఈ వార్తను ఆయన ఖండించలేదు కానీ....ఇప్పుడైతే ఆ ఆలోచన లేదని, నెక్ట్స్ తాను చేయబో చిత్రం ప్రభాస్‌‍తోనే అని స్పష్టం చేశారు.
continue reading......

ఆయన మాటలను బట్టి ఎప్పటికైనా సీక్వెల్ ఖాయమని స్పష్టం అవుతోంది. అయితే దానికి కథ, స్క్రిప్టు రెడీ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడప్పుడే దానిపై ప్రకటన చేయడానికి రాజమౌళి ఇష్టపడటం లేదని అర్థమవుతోంది.
ప్రభాస్ సినిమా విషయానికొస్తే...ఈ చిత్రం కాకతీయుల చరిత్రను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాజు పాత్రలో కనిపించనున్నారు. కాకతీయుల నేపథ్యంతో పాటు వివిధ రకాల నేపథ్యాలను యాడ్ చేసి ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్‌ను ఈచిత్రంలో రాజమౌళి సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నారు.
తను అనుకున్న కాన్సెప్టును పర్‌ఫెక్టుగా ప్రజెంట్ చేయడానికి రాజమౌళి చాలా కష్టపడతాడు. ఏదో కానిచ్చామని కాకుండా తనకు ఎవరూ వంక పెట్టకుండా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. అందుకే ప్రమోగాత్మకంగా చేపట్టిన ‘ఈగ' చిత్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నాడు. తీసుకుంటే తీసుకున్నాడు కానీ తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా దాన్ని రూపొందించారు. ప్రభాస్ చిత్రం పూర్తవడానికి కూడా లాంగ్ టైమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ చిత్రం చారిత్రక సీన్లతో కూడుకుని ఉండటం వల్ల చాలా స్టడీ చేయాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం మామూలే అనే వాదన వినిపిస్తోంది.

No comments:

Post a Comment