Monday, July 23, 2012

ప్రభాస్ ఎవరిపై పోరాటం చేశాడు?


ఆలోచనలనే ఆయుధాలుగా మలచుకొనే యువకుడతను. ధైర్యమే అతని సైన్యం. దూసుకుపోవడం తప్ప... వెనుకంజ వేయని నైజం అతని సొంతం. ఇంతకీ ఎవరతను? ఎవరిపై పోరాటం చేశాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నాడు దర్శకుడు లారెన్స్‌. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రెబల్‌'. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాండిచ్చేరిలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో షూటింగ్ పూర్తవుతుంది.
''యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రభాస్‌ నటనని కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాం.
లారెన్స్‌ అందించిన బాణీలు అందరినీ ఆకట్టుకొంటాయి''అని నిర్మాత చెప్తున్నారు. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేయనున్నారు. కృష్ణంరాజు ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు.అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెపుతూ.. లాభనష్టాల గురించి అతను ఆలోచించడు. కేవలం మంచి చెడులే ముఖ్యమంటాడు. గెలుపోటములపై అతనికి బెంగ లేదు. తిరుగుబాటు చేసి పోరులో నిలవడమే అవసరమంటాడు. అందుకే అతను రెబల్‌గా ముద్రవేయించుకున్నాడు. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఇంతగా తిరగబడ్డ ఆ పోరు బిడ్డ ఎవరు? అతని అసలు లక్ష్యమేమిటి? తదితర విషయాలు మా సినిమాలో చెప్తున్నాం" అన్నారు.
ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా, దీక్షాసేథ్‌ చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.
హీరో,హీరోయిన్స్ పాల్గొంటున్న కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం. ఈ నెలాఖరికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామని అన్నారు నిర్మాతలు. ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల కోసం రూ.2 కోట్ల వ్యయమైంది. ప్రత్యేకంగా కాళీమాత విగ్రహాన్ని తయారుచేయించాం. మూడు పాటల్లో రెండు విదేశాల్లో చిత్రీకరిస్తాం. స్వరాల బాధ్యతను కూడా లారెన్స్‌ తీసుకొన్నారు.
అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ.."షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా" అని ప్రభాస్ చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: ‘డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

No comments:

Post a Comment