Thursday, June 6, 2024

Star hero impressed with Kalki 2898 AD


Kalki 2898 AD is one of the most-awaited films in Telugu cinema as it has Prabhas in a lead role. Some of the biggest names in Indian cinema are playing key roles in the film.

Amitabh Bachchan has wrapped up his part of the shoot and he is very much impressed with Nag Ashwin and his work. Speaking in an interview to a local daily in Mumbai, Amitabh said that if there is one film which he is looking forward to, it is Kalki.

Kamal Haasan also plays a key role in this film which has music by Santhosh Narayanan. Vyjayanthi Movies produced this film which is all set to hit the screens on June 27th on a massive scale.

Thursday, September 6, 2018

ప్రభాస్ అధికారికంగా ప్రకటించేశాడు

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేస్తున్న ‘సాహో’. దాదాపు రెండు సంవత్సరాలుగా ‘సాహో’ తప్ప మరే ప్రాజెక్ట్ ను ప్రభాస్ సెట్స్ పైకి తీసుకు వెళ్లలేదు. వచ్చే సమ్మర్ లో ‘సాహో’ చిత్రం విడుదల కాబోతుంది. దాదాపు ఏడు సంవత్సరాల్లో కేవలం  ‘బాహుబలి’ మరియు సాహో చిత్రాలకే ప్రభాస్ సమయం అంతా కేటాయించాడు. అందుకే ఇకపై చాలా స్పీడ్ గా సినిమాలు చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘సాహో’ చిత్రం పూర్తి కాకుండానే తదుపరి చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది.
ప్రభాస్ తదుపరి చిత్రం త్రిభాష చిత్రంగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయంపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. తన త్రిభాష చిత్రం గురించి ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని - త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంకు కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా ప్రభాస్ పేర్కొన్నాడు. గోపీ కృష్ణతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ చిత్రంను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో తనకు జోడీగా పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. మొన్నటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు రాగా - ఆమెకు ప్రస్తుతం క్రేజ్ అంతగా లేదు. ఆ కారణంగానే పూజాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది.

Tuesday, September 4, 2018

ప్రభాస్ కోటిచ్చాడు..

కేరళ క‘న్నీటి’ వర్షంలో తడిసిముద్దైన సంగతి తెలిసిందే.. శతాబ్ధకాలంలోనే పెద్ద ఎత్తున ముంచెత్తిన వరదలతో వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో మరణించారు. కేరళను ఆదుకోవాలని అక్కడి సీఎం పిలుపునివ్వడంతో ఎంతో మంది ఎన్నో కోట్ల రూపాయలను పంపించారు. వివిధ దిగ్గజ సంస్థలు ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.
కేరళను ఆదుకోవడంలో సినీ ప్రముఖులు కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు - తమిళం - మలయాళ - హిందీ నటులు ఇతోధికంగా సాయం చేశారు. కానీ ఇతర సినీ స్టార్లతో పోలిస్తే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ ఆర్థిక విరాళాలు తక్కువే అందించారనే విమర్శ ఉంది. అందరికంటే ముందు తమిళ స్టార్ హీరో బ్రదర్స్ సూర్య-కార్తి సోదరులు రూ.25 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత మిగతా హీరోలు కూడా భారీగానే విరాళాలందించారు.

తాజాగా మలయాళ సినీ స్టార్ల పిసినారితనంపై కేరళ టూరిజం శాఖ మంత్రి కడకంపల్లి సుందరేశన్ - నటి సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మలయాళ నటులు విరాళాలు పెద్ద ఎత్తున ఇవ్వలేదని వారు మండిపడ్డారు. కోట్ల విలువ చేసే కార్లలో తిరిగే నటులున్న మలయాళ ఇండస్ట్రీలో సాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదని మండిపడ్డారు. 

కేరళ మంత్రి సుందరేశన్ మాట్లాడుతూ ‘మన రాష్ట్రంలో గొప్ప నటులున్నారు. ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకూ సంపాదిస్తున్నారు. కానీ లక్షల్లోనే ఇచ్చారు. మలయాళంలో పెద్దగా మార్కెట్ లేని తెలుగు హీరో ప్రభాస్ రూ.కోటి విరాళం ఇచ్చారు. అతడిని చూసి నేర్చుకోండి’ అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. 

అసలు అధికారికంగా ప్రభాస్ విరాళం ఇచ్చాడని తెలుసు కానీ ఎంతిచ్చాడనేది ఎవ్వరికీ తెలియదు.. ఆయన ఫ్యాన్స్ 25 లక్షలు ఇచ్చాడని అనుకున్నారు. ప్రభాస్ కూడా తాను విరాళమిచ్చిన విషయాన్ని బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు కేరళ మంత్రి... ప్రభాస్ కోటి రూపాయలు ఇచ్చాడని అనడం.. ప్రభాస్ ది గొప్ప మనసు అని కీర్తించడం చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో మంచి చేసి కూడా ప్రచారం చేసుకోలేదంటూ కొనియాడుతున్నారు. ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది. 

Thursday, August 30, 2018

భారతంలో అర్జునుడుగా ప్రభాస్?

మిస్టర్ పెర్ఫెక్ట్ వర్సెస్ మిస్టర్ పెర్ఫెక్ట్!  బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వేసిన బిగ్ ట్రాప్లో టాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ప్రభాస్ అడ్డంగా ఇరుక్కోబోతున్నాడా? అంటే అవుననే తాజాగా సమాచారం అందింది. అయితే ప్రభాస్ని ఇరికించే అమీర్ ప్లానేంటో తెలియాలంటే డీప్గా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.
మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత కొంతకాలంగా `మహాభారతం 3డి` చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ అంబానీతో కలిసి దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో మహాభారతం సిరీస్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మూడు నుంచి ఐదు భాగాలుగా తెరకెక్కించేందుకు తనకు ఏకంగా పదేళ్ల సమయం పడుతుందని ప్రకటించాడు. 

ఆ క్రమంలోనే ఈ సినిమాలో నటించే కాస్టింగ్ విషయమై ఆసక్తికర చర్చ సాగింది. అమీర్ ఖాన్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ దీపిక పదుకొనే వంటి స్టార్లను సంప్రదించారన్న చర్చ సాగింది. అమీర్ కృష్ణుడిగా నటిస్తే దీపిక పదుకొనే ద్రౌపది పాత్ర పోషించనుందని ప్రచారమైంది. ఇప్పుడు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ ఈ చిత్రంలో అర్జునుడు పాత్రలో నటిస్తాడని ప్రచారమవుతోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్ ప్రచారం మేరకు.. ఇప్పటికే మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ బాహుబలి ప్రభాస్ని సంప్రదించాడని తెలుస్తోంది. వాస్తవానికి గత కొంతకాలంగా మహాభారతం తెరకెక్కుతుందా.. లేదా? అన్న సందిగ్ధత నెలకొందని వార్తలొచ్చాయి. పురాణేతిహాసాలతో ఎన్నో చిక్కులుంటాయి. `పద్మావతి` తెరకెక్కించేప్పుడు భన్సాలీకి ఎదురైనట్టే.. సేమ్ సన్నివేశమే రిపీటైతే అది పెద్ద రిస్క్ అవుతుందని భావించి అమీర్ సైలెంటుగా ఉన్నారని ప్రచారమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మిస్టర్ పెర్ఫెక్ట్ ఈ ప్రాజెక్టు విషయమై రాజీకొచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారట. ఆ క్రమంలోనే కాస్టింగ్ సెలక్షన్స్ లోనూ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు అమీర్ అమితాబ్ వంటి స్టార్లు నటించిన `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. 

Sunday, May 7, 2017

BBC వారు బాహుబలిని ఎత్తేశారు


బాహుబలి 2 సినిమాను ఇప్పుడు తెలుగు సినిమా అనుకోవడం లేదు ఎవ్వరూ.  ఒక ప్రపంచ స్థాయీ సినిమాని  తెలుగువాడు తీసాడు అని చెప్పుకుంటున్నారు. అంతాలా బాహుబలి 2 సినిమాని ప్రపంచ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇంతటి గొప్ప ప్రశంస మరే ఇండియన్ సినిమాకి రాలేదు ఈ మధ్య కాలంలో. మన సినిమా గురించి మన మీడియా కవర్ చేయడం వేరు. ఒక తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ టివి కవర్ చేయడం వేరు కదా.. ఇప్పుడు అదే జరిగింది. ఒక ఛానల్ ఆకాశానికి ఎత్తేసింది.

నోటెడ్ ఇంటర్నేషనల్ ఛానల్.. బిబిసి వాళ్ళు బాహుబలి సక్సెస్ ని బ్రాడ్ కాస్ట్ ఆరంభ సమయంలో అద్భుతంగా  చెప్పారు. బాహుబలి పొందిన అసాధారణ విజయం ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది అని అన్నారు. అక్కడి న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం బాహుబలి కిందటి వారంలో విడుదలైన సినిమాలలో యూఎస్ బాక్స్ ఆఫీసు కలెక్షన్లు లో 3వ స్థానంలో ఉంది అని తెలిపారు. బాహుబలి ఒక వారం కలెక్షన్లు కిందటి వారం యూకే లో టాప్ 10 సినిమాలో ఒకటిగా నిలిచింది. అలాగే తమిళ్ హిందీ తెలుగు వర్షన్ కూడా మంచి ఆదరణ పొందిందని అని చెప్పారు. బిబిసి వాళ్ళు బాహుబలిని దాన్ని వెనుక ఉన్న టీమ్ ని పొగడ్తలతో ముద్ద చేశారంతే. ఇండియన్ సినిమాలు ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే సత్తాని ఇచ్చింది అని చెప్పారు.

బాహుబలి అక్కడ విడుదలై హాలీవుడ్ సినిమాని కొంత గందరగోళపెట్టింది. ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఫురీయ్య్యెస్  8.. గార్డ్యన్స్ ఆఫ్ ది గెలాక్సీ 2 కి గట్టి పోటీ ఇచ్చింది. రాజమౌళి బాహుబలి యూఎస్ లో $13M కలెక్షన్లు చేసింది. తెలుగు సినిమాకు ఇప్పుడు ఒవెర్సెస్స్ లోకూడా గొప్ప మార్కెట్ ఏర్పడింది బాహుబలి వలన కాబట్టి.. మరో సారి.. సాహో బాహుబలి!!

బాహుబలి-2 వెయ్యి కోట్లు కొట్టేశాడహో..



‘బాహుబలి: ది కంక్లూజన్’ వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని అందరూ అంచనా వేసిందే. కాకపోతే ఈ ఘనత అందుకోవడానికి ఎక్కువ రోజులే పడుతుందని.. ఫుల్ రన్లో కానీ ఆ మైలురాయిని టచ్ చేయదని చాలామంది అనుకున్నారు. ఐతే ఈ విషయంలో బాహుబలి-2 అంచనాల్ని మించిపోయింది. రెండో వీకెండ్ కూడా అవ్వకముందే వరల్డ్ వైడ్ రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించిందీ సినిమా.

శనివారమే ఈ సినిమా బాముబలి-2 ఈ మైలురాయిని దాటేసింది. ఇండియా వరకే రూ.800 కోట్ల గ్రాస్ వసూల్లు సాధించిన ‘ది కంక్లూజన్’.. అంతర్జాతీయంగా మిగతా దేశాలన్నింట్లో కలిపి రూ.200 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. మొత్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను అలవోకగా దాటేసిందీ సినిమా. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు అత్యధిక వసూళ్ల రికార్డు ‘పీకే’ పేరిట ఉండేది. ఆ సినిమా రూ.800 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు సాధించింది. ‘బాహుబలి-2’ ఆ రికార్డును కేవలం వారం రోజుల్లోనే దాటేసింది.

రెండో వీకెండ్లోనూ హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ‘బాహుబలి: ది కంక్లూజన్’.. ఫుల్ రన్లో రూ.1500 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అందుకున్నా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. ఒక్క అమెరికాలో మాత్రమే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా దూసుకెళ్తుండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో రూ.300 కోట్ల గ్రాస్ వసూలయ్యేలా ఉంది.

Sunday, April 2, 2017

బాహుబలి-2 ఆ థర్టీ మినిట్స్ పీక్స్..!


సిని ప్రియులంతా ఎదురుచూస్తున్న రాజమౌళి సృష్టించిన బహుబలి-2 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బిగినింగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో రెండో పార్ట్ అంతకుమించి రికార్డులను షురూ చేసేందుకు వస్తుంది.  ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన జక్కన్న సినిమా మీద అంచనాలను పెంచేలా చేస్తున్నాడు.  
ఇక రాజమౌళి మాటల్లోనే బాహుబలి-2 లో బాహుబలి, భళ్లాలదేవలతో పాటుగా శివగామి, దేవసేన పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయట. ఈ రెండు పాత్రలను సృష్టించిన విధానం చాలా బాగుంటుందని.. ఇద్దరి మధ్య ఓ థర్టీ మినిట్స్ సీన్స్ ఉంటాయని అవి సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాయని అంటున్నాడు రాజమౌళి.

తెలుగు సినిమాగా వచ్చిన బాహుబలి ఈ సెకండ్ పార్ట్ కు ఇండియన్ సినిమా అంటూ ప్రమోట్ చేస్తుండటం విశేషం. దాదాపు సినిమా కోసం ఐదేళ్లు కష్టపడి పనిచేసిన చిత్రయూనిట్ ప్రతిభ సినిమాలో కనిపించనుంది. అనుష్క దేవసేనగా మొదటి పార్ట్ లో కేవలం ఓల్డ్ గెటప్ లోనే చూశారు. కాని అసలు సిసలైన అందాల దేవసేనను పార్ట్ 2లో చూస్తారని అంటున్నారు.  
శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్క నటించారు. ఇక మొదటి పార్ట్ మొత్తం పాత్రల పరిచయంతోనే సరిపెట్టిన జక్కన్న అసలైన కథ సెకండ్ పార్ట్ లోనే పెట్టాడట. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో అదే రేంజ్లో రిలీజ్ అవబోతున్న బాహుబలి-2 ఎన్ని ప్రభంజనాలను సృష్టిస్తుందో చూడాలి. 

మూడు బాషల్లో ప్రభాస్ 'సాహో'


ఇక ఏప్రియల్ 28న ''బాహుబలి 2'' రిలీజ్ అయిపోయిందంటే.. కండలవీరుడు ప్రభాస్ పూర్తిగా ఆ టింట్ నుండి బయటకు వచ్చేసినట్లే. అయితే ప్రభాస్ ఆల్రెడీ బయటకు వచ్చేశాడని మారిపోయిన తన హెయిర్ స్టయిల్ చూస్తే మనకు అర్ధమైపోతోందిగా. ఇప్పుడు తన తదుపరి సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. 

నిజానికి కొత్త కుర్రాడు సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమాను ఆల్రెడీ మొదలెట్టేశాడు. ఈ సినిమా తాలూకు టీజర్ ను బాహుబలి 2 సినిమాతో పాటు రిలీజ్ చేస్తారని టాక్ ఉంది. అయితే ఈ సినిమాను ఒకేసారి తెలుగు తమిళ్ హిందీ బాషల్లో రూపొందించడమే ప్లాన్. అలాంటప్పుడు సినిమా టైటిల్ ఏమని పెట్టాలి? బాహుబలి తరహాలో మూడు బాషల్లో ఒకే టైటిల్ అయితే బెటర్ అని అంచనాలకు వచ్చేసి ఒక టైటిల్ పిక్ చేశారు. ''సాహో'' అనే పేరు బాహుబలిలోని సాంగుతో బాగా పాపులర్ అయ్యింది. అందుకే ఇప్పుడు ''సాహో'' అనే టైటిల్ యువి క్రియేషన్స్ వారు రిజిష్టర్ చేశారు. 

సాహో సినిమాతో.. ప్రభాస్ బాహుబలి ద్వారా ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో.. అంత పేరును నిలబెట్టుకోవాల్సి ఉంది. మరి చూద్దాం ఈ సాహో ఎలా ఉండోబోతోందో