Saturday, September 28, 2013

రాజమౌళి సినిమాకు పైరసీ ప్రూఫ్ !



రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా 'బాహుబలి'. ఈ సినిమాకోసం పైరసీ ప్రూఫ్ ను తొడిగారు రాజమౌళని అంటున్నారు నిర్మాతలు. ఈ పైరసీ ప్రూఫ్ ఏంటి అనుకుంటున్నారా....మన వాచ్ లు సెల్ ఫోన్లు ఎలాగైతే వాటర్ ప్రూఫ్ వి తీసుకొని నీటి బారినుంచి కాపాడుకుంటామో ఇది పైరసీ భారి నుంచి కాపాడుకోవడానికి పైరసీ ప్రూఫ్. ఈ విషయం తెలుస్తే నిర్మాతలు ముందే కొనుక్కునేవారు కదా అని మీరు అనుకోవడంలో తప్పు లేదు. అయితే అది షాపుల్లో దొరికే రెడీమేడ్ వస్తువు కాదు. ఎందుకంటే పైరసీ కాకుండా తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు కనుక. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాకి సంబంధించి పైరసీ అవడంతో వెంటనే అలర్ట్ అయిన ఈ చిత్ర నిర్మాతలు దర్శకుడు తమ అసిస్తేంట్ల వద్ద అగ్రిమెంట్ తో పాటు ఏదైనా జరిగితే అందుకు తగిన నష్టనివారణ కోసం బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారట. అంతేకాక ఎడిటింగ్ సంబందించిన పాస్ వర్డ్ అన్ని మర్చేశారట. ఇది పైరసీ నుంచి బయటపడడానికి బాహుబలి ఏర్పాటు చేసుకున్న పైరసీ ప్రూఫ్ !

Monday, September 16, 2013

రాజమౌళి 'బాహుబలి' కొత్త ప్రయోగం... హ్యారీపోర్టర్ విన్యాసాలు!


FILE
ప్రస్తుతం లవ్‌, యాక్షన్‌, రాజకీయాలు, సాంఘీకాలు, ఫాంటసీ వంటి వాటన్నింటినీ చూసేసినా జనాలకు రాజమౌళి కొత్తప్రయోగంతో ముందుకు రాబోతున్నాడు. అదే 'బాబహుబలి'. ఇందులో ప్రభాస్‌, రానా విరోధులుగా నటిస్తున్నారు. రాజమాత పాత్రలో రమ్యకృష్న నటించనున్నట్లు తెలిసింది. ఆమె కుమారుడుగా అడవిశేషు (పంజాఫేమ్‌) నటిస్తున్నాడు. 



ఈనెల 15నుంచి అడవిశేషు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. విశ్వసనీయ సమచారం ప్రకారం... జానపద చిత్రాలంటే బ్లాక్‌ అండ్‌ వైట్‌లో దర్శకుడు విఠలాచార్య ఫేమస్‌. ఆయన చేసిన ప్రయోగాలు ఇప్పటికీ టెక్నాలజీ మారినా ఆశ్చర్యం కల్గిస్తాయి. ఆ పంథాలో రాజౌళి వెళ్తున్నాడు. అయితే ఇప్పటి టెక్నాలజీ ప్రకారం కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. హ్యారీపోర్టర్‌ లాంబి విన్యాసాలు కూడా ఇందులో కన్పించనున్నాయి. ఏదిఏమైనా బాహుబలి క్రేజ్‌ సంపాదించుకుంది.

Prabhas,Rana,Anushka & SSR Bahubali Schedule starts from Today

Tollywood hit director  Rajamouli’s prestigious venture Bahubali  schedule starts from today in Ramoji Film city. Rajamouli is leaving no stone unturned to turn the film an epic in Indian film history.

He made Rana, Prabhas and Anushka train vigorously in sword fighting and horse riding. He is maintaining utmost secrecy on the film’s concept. This resulted in speculation on the subject of the film.Inside reports indicate the film involves Kings and Kingdoms and many are of the opinion that the film is inspired by great warrior king Prithvi Raj Chauhan and Rani Padmini.
On Other hand after making a comeback playing wife of Lord Yama in last year’s socio fantasy, Yamudiki Mogudu, actress Ramya Krishna is all set to play the role of a queen in the Prabhas – Rana starrer Baahubali. It is reliably learnt that Ramya will be seen playing mother to both Rana and Prabhas in the movie. Sources in the film’s unit say that her character would be a key screenplay element that sets the whole story into a twist and excitement.

Monday, September 9, 2013

ఎస్.ఎస్.రాజమౌళి వంటవాడిలా!




తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ దర్శకుడిగాఅభిమానులు ముద్దుగా జక్కన్నగా పిలుచుకునే రాజమౌళి సినిమాలనే అద్భుతంగా తెరకేక్కిస్తాడని ఇప్పటి వరకు మనం అనుకున్నాము. కానీ ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్న పై ఫోటో చూసి రాజమౌళి అభిమానులు తమ దర్శకుడు వంటలు కూడా బాగా చేస్తాడని అంటున్నారు. పైన కనిపిస్తున్న ఫోటోలో రాజమౌళి టమాటో తో చేసిన పులిహోర ను తయారు చేస్తున్నాడు. ఈరోజు వినాయక చవితి కనుక వినాయకుడి నైవేద్యం కోసం తయారు చేస్తున్నాడని అనుకునేరు. ఆ పులిహోరను తయారు చేసింది రమారాజమౌళి అంట. టమాటో పులిహోర చేయడంలో రమ చాల అనుభావరాలు అట. అప్పుడే ఈ ఫోటో పై ఫిల్మ్ నగర్లో సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమా కోసం ఎంతో కష్టపడుతున్న ప్రభాస్ రానా లకోసం రాజమౌళి పండుగ స్పెషల్ గా అందించడానికి ఇలా వంటగదిలో ఓ పట్టు పడుతున్నాడని సెటైర్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమా రెండో షెడ్యుల్ ఇటీవలే పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ కూడా శరవేగంగాజరుగుతుంది. 

Thursday, September 5, 2013

బాహుబలిలో సుధీప్ కీ రోల్



సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమా ద్వారా కన్నడ స్టార్ హీరో సుధీప్ తెలుగు వారికి పరిచయమై, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ హన్డ్సం హీరో ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ లో కూడా ఓ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సుదీప్ కనిపించేది ఓ చిన్న అతిధి పాత్రలో అయినప్పటికీ అది సినిమాకి చాలా కీలకం అని సమాచారం.

తెలుగు సినిమా రంగంలో ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్ తో ‘బాహుబలి’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా కనిపించనున్నారు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ‘రాజమాత’ పాత్రలో కనిపించనుంది. ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ ద్రామాని ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హై రేంజ్ లో విఎఫ్ఎక్స్ ఉండనున్నాయి, ఇప్పటికే ఓ స్పెషల్ టీం విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేయడం మొదలు పెట్టారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.
http://weloveprabhas.com/

Wednesday, September 4, 2013

Most frightening director for Prabhas

www.weloveprabhas.com

Most frightening director for Prabhas
Young Rebel Star Prabhas is now the safest hero in Tollywood film industry. His flicks are not present in the current scenario and hence they escaped the T – agitation. 2014 elections won’t have any affect on Prabhas’ future films as “Bahubali” will be releasing in 2015.

Speaking about the most frightening director, Prabhas stated that Rajamouli literally made his feel utmost pressure during the time of Chatrapathi. It is known that the output of this flick impressed audience belonging to all age groups. It seems that Prabhas felt tough in acting in few sequences.

Now, as Prabhas is acting in the directional venture of Rajamouli, we can expect similar scenarios for this top hero. As a stone will turn into a beautiful statue after hitting it in all the angles, Prabhas is turning into a No.1 star in the hands of Rajamouli. Hence, he is always willing to work with him in spite of the tough sequences.  

Tuesday, September 3, 2013

‘బాహుబలి’ లో సుదీప్ పేరు...క్యారెక్టర్


సుదీప్ లేకపోతే ‘ఈగ'ను ఊహించుకోవడం కష్టమే అనేంతగా నటనను ప్రదర్శించి రాజమౌళిని మెప్పించిన సుదీప్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా రాజమౌళి ‘బాహుబలి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో గెస్ట్ రోల్ లో ఓ కథలో ఓ కీలకమైన మార్పుని తెచ్చే పాత్రను సుదీప్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై చాలా ఎక్సైట్ మెంట్ తో సుదీప్ ఉన్నారు. ఈ విషయమై సుదీప్ పుట్టిన రోజు (నిన్న) మీడియాతో మాట్లాడుతూ... నేను బాహుబలి చిత్రంలో ఆయుధాల వ్యాపారిగా కనిపిస్తాను. నా పాత్ర పేరు అస్లం ఖాన్. అంతేగాక ఈ చిత్రంలో నాకు సత్యరాజ్ కు మధ్య కత్తి పైట్ సీన్ ఉందని అన్నారు. అలాగే సుదీప్ ట్వీట్ చేస్తూ..." బాహుబలి షూటింగ్ ఖచ్చితంగా ఓ మంచి ఎక్సపీరియన్స్ , చాలా అద్బుతమైన సెట్స్, మంచి టీమ్ , రాజమౌళి గారితో మళ్లీ పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలతో ట్వీట్ చేస్తాను ." అన్నారు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రానాతో పాటు ‘పంజా' ఫేమ్ అడివి శేష్ నటించనున్నాడు. వీరితో పాటు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సుదీప్ నటించనున్నాడని, ఆయన పాత్ర నిడివి చిన్నదే అయినా చాలా ప్రాధాన్యత వుంటుందని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ‘arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.


Monday, September 2, 2013

‘బాహుబలి’ మూవీ డైలాగులు లీక్

ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం ‘బాహుబలి'. రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతున్న ఈచిత్రంలోని డైలాగులు కొన్ని ఆన్‌లైన్లో లీకయ్యాయి. ‘కొండలు పిండి చేసే సమయం రానీ...కార్య సూరుడు అదరడు, బెదరడు' డైలాగ్‌తో పాటు, ‘నీయందు ఆయుధం, అదేనీ ఆత్మవిశ్వాసం' అనే డైలాగులు ఆన్ లైన్లో దర్శనం ఇస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రాణా, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. ‘బాహుబలి’ మూవీ డైలాగులు లీక్ బాహుబలి తాజాగా ఈచిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ విశేషాలను రాణా వివరిస్తూ.....ఈ షెడ్యూల్ మొత్తం ఓమారథాన్‌లా సాగింది. ఉదయం 7 గంటలకు రాత్రి 10 గంటలకు వరకు షూటింగ్. అర్థరాత్రి వరకు కూడా ట్రైనింగ్ జరిగింది' అంటూ ట్వీట్ చేసాడు. ‘ఒక వారాంతం అయితే ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నాన్ స్టాప్‌గా సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటలు పని సాగింది' అని రాణా వెల్లడించారు. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

బాహుబలి కోసం రాజమౌళి శ్రమ


andhra prabha,www.prabhanews.com,andhra prabha chintana,andhra prabha news paper,andhra prabha epaper,telugu news,andhra,prabhanews,andhra prabha onile.in,breaking news,chintana,sports,cinima,show,బాహుబలి కోసం రాజమౌళి శ్రమ మరోధ్యాస కించిత్తు కూడా లేకుండా వృత్తిలోనే అధిక సమయాన్ని వెచ్చించే వారిని పని రాక్షసులుగా అభివర్ణించడం చూస్తుంటాం. ఆ కోవలో దర్శకుడు ఎస్‌. ఎస్‌. రాజమౌళిని ఉదహరిస్తున్నాయి సినీవర్గాలు. ఇంతవరకు అపజయం ఎరుగని దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన దర్శకత్వంలో నటించాలని హీరోలు ఉవ్విళ్లూరడం తెలియందికాదు. అయితే ఆ అవకాశం అనుకోగానే అందరికీ లభించదు. ఎంత ఇమేజ్‌ ఉన్న స్టార్‌ డేట్స్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా తన కథకు సరిపోయే హీరోనే ఎంపికచేసుకోవడం రాజమౌళిలోని మరో ప్రత్యేకత. కాగా ప్రభాస్‌ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'బాహుబలి'పై ఇప్పుడు అందరిచూపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవ్వరూ తియ్యనిరీతిలో అత్యంత భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని అంటున్నారు. రామోజీఫిలింసిటీలో నిర్మించిన భారీ సెట్లో ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రభాస్‌ సరసన అనుష్క నాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రను రానా పోషిస్తున్నారు. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడైన ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుండగా, ఈ పీరియాడికల్‌ కథాంశ చిత్రానికి జాతీయస్థాయిలో పేరున్న సాబు సిరిల్‌ కళను అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం రాత్రి, పగలు తేడాలేకుండా నిర్విరామంగా షూటింగ్‌ చేస్తున్నారట. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షూటింగ్‌ జరుగుతుండటమే కాదు ఆదివారంనాడు ఉదయం 7 గంటలకు షూటింగ్‌ను మొదలుపెట్టి సోమవారం ఉదయం 8 గంటల వరకు అంటే 25 గంటలపాటు నిర్విరామంగా షూటింగ్‌ జరిపారట. సినిమా రంగంలో కెప్టెన్‌గా భావించే దర్శకుడి కనుసన్నలలోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి అందుకే రాజమౌళిని పని రాక్షసుడిగా అభివర్ణిస్తున్నాయి సినీవర్గాలు. అయితే రాజమౌళికి పరిస్థితిని బట్టి ఎంత సమయమైనా లెక్కించకుండా షూటింగ్‌ చేయడం కొత్తేమీకాదని పరిశ్రమలో అంటున్నారు. జానపద కోణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఆయన మరింత ఎక్కువగా శ్రమిస్తున్నారని అంటున్నారు. ఈ తరహా చిత్రాలలో నటించే నటీనటులు మేకప్‌, వస్త్రధారణ కోసం అధిక సమయం వెచ్చించాల్సి రావడంతోనే రాజమౌళి ఈ చిత్రం షూటింగ్‌ను రేయింబవళ్లు లెక్కచేయక నిర్విరామంగా చేస్తున్నారని మరోపక్క వినిపిస్తోంది.