Monday, September 9, 2013

ఎస్.ఎస్.రాజమౌళి వంటవాడిలా!




తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ దర్శకుడిగాఅభిమానులు ముద్దుగా జక్కన్నగా పిలుచుకునే రాజమౌళి సినిమాలనే అద్భుతంగా తెరకేక్కిస్తాడని ఇప్పటి వరకు మనం అనుకున్నాము. కానీ ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్న పై ఫోటో చూసి రాజమౌళి అభిమానులు తమ దర్శకుడు వంటలు కూడా బాగా చేస్తాడని అంటున్నారు. పైన కనిపిస్తున్న ఫోటోలో రాజమౌళి టమాటో తో చేసిన పులిహోర ను తయారు చేస్తున్నాడు. ఈరోజు వినాయక చవితి కనుక వినాయకుడి నైవేద్యం కోసం తయారు చేస్తున్నాడని అనుకునేరు. ఆ పులిహోరను తయారు చేసింది రమారాజమౌళి అంట. టమాటో పులిహోర చేయడంలో రమ చాల అనుభావరాలు అట. అప్పుడే ఈ ఫోటో పై ఫిల్మ్ నగర్లో సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమా కోసం ఎంతో కష్టపడుతున్న ప్రభాస్ రానా లకోసం రాజమౌళి పండుగ స్పెషల్ గా అందించడానికి ఇలా వంటగదిలో ఓ పట్టు పడుతున్నాడని సెటైర్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమా రెండో షెడ్యుల్ ఇటీవలే పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ కూడా శరవేగంగాజరుగుతుంది. 

No comments:

Post a Comment