హైదరాబాద్:రాజమౌళి,ప్రబాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూగా ఫుల్ స్వింగ్ లో కేరళలో జరుగుతోంది. సినిమాలోని కీ సీన్స్ ని ఇక్కడ షూట్ చేస్తున్నారు. అలాగే కథలోని కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని సైతం ఇక్కడ ప్లాన్ చేసారు. డిసెంబర్ 3 వ తేదీ వరకు ఇక్కడ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది.
తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ - మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.
అనుష్క ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ఇతర తారాగణం. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. అనుష్క కి తమిళనాట కూడా మంచి మార్కెట్ ఉండటం కూడా సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అలాగే సత్యరాజ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర చేయటం కలసివచ్చే అంశం.
అనుష్క మాట్లాడుతూ.. ''రాజమౌళి సినిమాల్లో నటించాలంటే నాకు చాలా ఇష్టం. అది కొంచెం కష్టం కూడా! తెరపై చూసినప్పుడు ఆ కష్టం తొలగిపోతుంది. నా పాత్రకు మంచి స్పందన వస్తుంది''అని పేర్కొంది. ఇందులో అనుష్క దేవసేన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. రెండురోజుల క్రితం అనుష్క పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక టీజర్‌ను కూడా విడుదల చేశారు. చరిత్రాత్మక కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం భారీఎత్తున రూ.కోట్ల విలువైన సెట్లను వేస్తున్నారు సాబు శిరిల్.
No comments:
Post a Comment