Tuesday, November 26, 2013

'బాహుబలి' యుద్ధం పూర్తి డిటేల్స్

 రాజమౌళి,ప్రబాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. 'బాహుబలి' కోసం ఓ భారీ యుద్ధాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ప్రధాన తారాగణంతో పాటు రెండు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులపై యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దీనికోసం ఆరు నెలలు నుంచి చిత్రబృందం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. రెండు వేల మంది కళాకారులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. ఆ సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు నెలల పాటు చిత్రీకరించనున్నారు.
ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ ''వచ్చే నెలాఖరు నుంచి 'బాహుబలి' యుద్ధం మొదలవబోతోంది. స్టోరీ బోర్డ్‌, ప్రి విజువలైజేషన్‌ వంటి పనులతో సన్నద్ధమవుతున్నాం'' అని తెలిపారు. దీనికి ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహిస్తారు.
  'బాహుబలి' యుద్ధం పూర్తి డిటేల్స్
డిసెంబర్ 3 వ తేదీ వరకు కేరళ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.
ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

No comments:

Post a Comment