Monday, August 20, 2012

ప్రభాస్‌ షాక్ అయ్యిపోవాలి: లారెన్స్

Lawrence About Prabhas Rebel Film   
హైదరాబాద్ : ''ప్రభాస్‌ ఈ సినిమా చూసి.. ఇందులో నటించింది నేనేనా? అని ఆశ్చర్యపోవాలని ఈ చిత్రాన్ని మొదలుపెట్టాను. ఆయన తనను తాను మార్చుకొని ఈ చిత్రంలో నటించారు''అంటున్నారు లారెన్స్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రెబల్‌'. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నారు. తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ . అలాగే ''ప్రభాస్‌ కుటుంబానికున్న ఓ పేరు... రెబల్‌. ఆ పేరుతో సినిమా అన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అభిమానులకు ఓ పండగలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాను''అన్నారు
for More Click Below......


తమన్నా మాట్లాడుతూ ''100% లవ్‌' సినిమాతో నటిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. 'రెబల్‌'లో నటిస్తున్నప్పుడు నేను కూడా డ్యాన్స్‌ చేస్తున్నాననీ, నేనొక డ్యాన్సర్‌ననే విషయం అర్థమైంది. లారెన్స్‌ నన్నలా తీర్చిదిద్దారు. ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి. అమ్మాయిల్లో ఆయనకు ఎక్కువమంది అభిమానులు ఎందుకున్నారో నాకు అర్థమైంది''అన్నారు.
అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు.

''రెబల్‌.. అంటే యాక్షన్‌ మాత్రమే అనుకోవద్దు. ఇందులో వినోదం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు అన్నీ ఉన్నాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం. సెప్టెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు నిర్మాతలు. జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రచార చిత్రాల్ని ఆవిష్కరించారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: ‘డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

No comments:

Post a Comment