Tuesday, August 7, 2012

‘రెబల్’ లో ప్రభాస్ లుక్ అదుర్స్

కొంత సేపటి క్రితమే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రెబల్’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ చాలా డాషింగ్ గా ఉన్నాడు. ఈ ఫోటో లోని ప్రభాస్ లుక్ ని ప్రభాస్ అభిమానులు మరియు సినీ అభిమానులు ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకి ముందే మంచి బిజినెస్ జరుపుకుంటోంది మరియు ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది

No comments:

Post a Comment