Saturday, August 25, 2012

‘రెబల్’ ఆడియో, మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?


Rebel Audio On Sep 5 Movie On Sep 21
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు లారెన్స్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రెబెల్'. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం ఆడియో సెప్టెంబర్ 5న, సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది.
తమన్నా, దీక్ష సేథ్ లీడ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న లారెన్స్ సంగీతం కూడా తానే స్వయంగా సమకూర్చుకున్నాడు. మార్తాండ్.కె వెంకటేష్ ఎడిటింగ్ పనులు చూసుకుంటుండగా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేసారు.
మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం ప్రభాస్ అభిమానుల టేస్టుకు తగిన విధంగా రూపొందిస్తున్నారు దర్శకుడు లారెన్స్. ఈచిత్రాన్ని జె. పుల్లారావు, జె. భగవాన్ శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment