Wednesday, August 22, 2012

ప్రభాస్ తో అందాల రాక్షసి

Lavanya Tripathi With Prabhas

 ‘అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి....ఆ సినిమా పెద్దగా విజయం సాధించక పోయినా మంచి అవకాశాలే దక్కించుకుంటోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ భామ ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుంది. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు.
కాగా...ఈ చిత్రానికి ఈ చిత్రానికి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర' లేదా ‘విశ్వామిత్ర' అనే టైటిల్ పెట్టే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలను రాజమౌళి ఇప్పటికే ఖండించారు. ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
రాజమౌళి దర్సకత్వంలో రూపొందబోయే చిత్రం కోసం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిళ్లా సమయంలో తన బాడీ షేప్ పై దృష్టి పెట్టిన ప్రభాస్ మరోసారి తన బాడీ పవర్ చూపించాలని ప్రిపేర్ అవుతున్నాడు. ఆ విషయమై ప్రభాస్ కి రాజమౌళి స్ట్రిక్ట్ గా చెప్పినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ప్లాన్ జరిగిపోయినట్టు తెలుస్తుంది. ఈగ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెట్టినందుకు గానూ తరువాత సినిమాను వీలయినంత తక్కువ టైంలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్తున్నారు.
దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్-రాజమౌళిల చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ ల వచ్చిన ఛత్రపతి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment