Wednesday, September 12, 2012

సర్వే : పవన్, మహేష్ వెనక్కి....ప్రభాస్ నెం.1


 తెలుగు సినిమా పరిశ్రమలో యూత్‌ను ఆకట్టుకునే హీరోలు ఎవరంటే కామన్‌గా ముందుకుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేర్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఓ సర్వేలో నెం.1 స్థానంలో నిలిచాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఓ ప్రముఖ దిన పత్రిక హైదరాబాద్‌లో నిర్వహించిన యూత్ ఐకాన్ సర్వేలో ఎక్కువ మంది ప్రభాస్‌కే ఓటేసారు. ప్రభాస్‌కి 16.2 % ఓట్లు పడగా, 15.9% ఓట్లతో మహేష్ బాబు రెండో స్థానంలో, 15.4% ఓట్లతో పవన్ కళ్యాణ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సుగల యువకులు 1000 మంది పాల్గొన్నారు.
prabhas turns no 1 survey
టాలీవుడ్ హీరోల్లో యూత్ ఐకాన్
1. ప్రభాస్ : 16.2 %
2. మహేష్ బాబు : 15.9%
3. పవన్ కళ్యాణ్ : 15.4 %
బాలీవుడ్ హీరోల్లో యూత్ ఐకాన్..
1. సల్మాన్ ఖాన్ : 50%
2. అమీర్ ఖాన్ : 14.4 %
3. అమితాబ్ బచ్చన్ : 13.9%
4. హృతిక్ రోషన్ : 13.4%
5. షారుక్ ఖాన్ : 12.6%
మరి ఈ సర్వేల సంగతి పక్కన పెడితే...ఈ లెక్కలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులకు కోపం తెప్పిస్తోంది. మా హీరో నెం.1 అని పవన్ కళ్యాణ్ అభిమానులు, నెం.1 స్థానానికి మహేష్ బాబే అర్హుడని మహేష్ అభిమానులు బలంగా వాదిస్తున్నారు.

No comments:

Post a Comment