Saturday, September 1, 2012

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రెబల్’ ఆడియో సెప్టెంబర్ 14న



హైదరాబాద్: ‘మిస్టర్ పర్ ఫెక్ట్'తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాంచనతో సూపర్ హిట్ కొట్టిన మాస్ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె. భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న భారీ చిత్రం ‘రెబెల్' ఆడియో సెప్టెంబర్ 14న విడుదల కాబోతోంది.
prabhas rebel audio on sept 14th
ఈ సందర్భంగా నిర్మాతలు జె. భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ...‘ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్‌లో హై టెక్నికల్ వేల్యూస్‌తో స్టైలిష్ మూవీగా తెరకెక్కుతున్న ‘రెబల్' ఆడియోను సెప్టెంబర్ 14న చాలా గ్రాండ్ గా రిజీజ్ చేయబోతున్నాం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మా బేనర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. అభిమానులు ప్రభాస్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్‌ని ప్రభాస్ చాలా ఎక్స్ లెంట్‌గా చేస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాల స్థాయిలో అద్భుతంగా తీస్తున్నారు. అన్ని ఎక్స్ పెక్టేషన్స్ కు ధీటుగా ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న ‘రెబల్' చిత్రాన్ని సెప్టెంబర్ నెలాఖరులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

No comments:

Post a Comment