Tuesday, September 4, 2012

రేపే ప్రభాస్ 'రెబల్‌'కి గుమ్మిడికాయ

Tomorrow Is The Final Day Rebel Shoot

 ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'రెబల్‌'. తమన్నా, దీక్షాసేథ్‌ హీరోయిన్స్ . రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రేపటి తో పూర్తి కానుంది. రేపు సాయింత్రం గుమ్మడికాయ కొట్టి షూటింగ్ ఫినిష్ చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్యాచ్ వర్క్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దర్శకుడు లారెన్స్ చిత్రం గురించి మాట్లాడుతూ... రెబల్‌గా ముద్రపడ్డ ఓ యువకుడు ఎదురు తిరిగి నిలిస్తే ఎలా ఉంటుందనేదే మా రెబెల్ చిత్రం. అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు పరుగెడుతుంది. మా హీరో నమ్మిన సిద్ధాంతం ఇదే. ఇంతకీ అతని పోరాటం ఎవరిపై? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.

No comments:

Post a Comment