యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొన్ని వారాల క్రితం షూటింగ్ సమయంలో ప్రభాస్ గాయపడినట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఆ వార్తలని ప్రొడక్షన్ టీం కొట్టి పారేయడంతో అప్పుడు సద్దు మనిగినా మళ్ళీ అలాంటి వార్తలే హల్ చల్ చేస్తున్నాయి.
కొంతమంది ప్రభాస్ ఆరోగ్యం బాలేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభాస్ గుర్రంపై నుండి పడడం వల్ల ఆరోగ్యం బాలేదని, అతను కోమాలో ఉన్నాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు.
మేము ప్రొడక్షన్ యూనిట్ తో మాట్లాడాము, వాళ్ళు ప్రభాస్ పర్ఫెక్ట్ గా ఉన్నాడని తెలిపారు. అలాగే ఈ మాచో హీరో షూటింగ్ లో ఎఫ్ఫెక్టివ్ గా పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే ప్రభాస్ కి దగ్గరి వారు ఈ వార్తల్ని కొట్టి పారేశారు. ఈ సినిమాలో కాస్త కష్టతరమైన యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి కానీ వాటివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే బాహుబలి ప్రొడక్షన్ టీం నటీనటుల రక్షణ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటోందని తెలిపారు.
No comments:
Post a Comment