Tuesday, January 28, 2014

ప్రభాస్ భారీ ఫాలోయింగ్ !


రెబల్ స్టార్ ప్రభాస్ కి క్రేజ్ ఎంత ఉన్నదో మనకు తెలియాలంటే అది చూడాల్సిందే. అది అంటే ఏమిటంటే...ప్రభాస్ మూడు నెలల క్రితం పేస్బుక్ లో ఎకౌంటు ఓపెన్ చేసిన విషయం తెలిసిందేఅయితే పేస్ బుక్లో ప్రభాస్ ఫాలో అయ్యేవారి సంఖ్యా 1 మిలియన్ మార్క్ ని దాటేసిందట. ఎకౌంటు ఓపెన్ చేసి 100 రోజుల లోపే ప్రభాస్ 1 మిలియన్ మార్క్ ని చేరుకోవడం చూస్తుంటే రెబల్ స్టార్ కి ఎంత క్రేజ్ ఉనందో అర్ధం అవుతుంది కదా. ఇంకా  ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. రాజమౌళి సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాలో చేయని విధంగా 'బాహుబలి' లో యుద్ద సన్నివేశాలను రుపొందిస్తున్నారట. అనుష్క రానా తమన్నా తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు

No comments:

Post a Comment