Monday, January 20, 2014

హాలీవుడ్ డైరెక్టర్ ను పడేసిన రాజమౌళి !

bahubali, rajamouli, jakanna,tollywood, hollywood, bahubali 100 days, ramoji film city
రాజమౌళి బాహుబలి ఎప్పుడు విడుదల అవుతుందా అని అనిపించేటట్లు గా ‘బాహుబలి’ విశేషాలు ప్రభాస్ అభిమానులను నిద్ర పోనివ్వడంలేదు. నిన్నటితో 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి సినిమా ‘బాహుబలి’ సెట్స్‌పై ఒక విశిష్ట అతిథి కనిపించి రాజమౌళికి షాక్ ఇచ్చాడు. ఆయన్ని చూసి రాజమౌళితో సహా యూనిట్ సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారట  ఇంతకి ఆయన మరెవరో కాదు రెండుసార్లు ఆస్కార్ అవార్డు గ్రహీత ఫ్రెంచ్ డైరెక్టర్ క్లాడ్ లీలోచ్. దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయనను తమ సెట్స్‌లో హఠాత్తుగా చూసిన రాజమౌళి ఆనందానికి, ఆశ్చర్యానికి అంతులేకపోయిందట. ‘బాహుబలి’ చిత్రం గురించి, షూటింగ్ గురించి క్లాడ్‌ రాజమౌళి ని అడిగి తెలుసుకున్నాడట.  ప్రస్తుతం 2000 మంది తో రామోజీ ఫిలింసిటీలో తీస్తున్న యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ తీరుచూసి ఈహాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి ని ప్రశంసలతో ముంచెత్తి వేసాడు అని అంటున్నారు. అంతే కాదు హాలీవుడ్ స్థాయి లో ఈ సినిమా నిర్మాణ విలువలు ఉన్నాయని కూడా క్లాడ్ ప్రసంసించారని వార్తలు వస్తున్నాయి.  ఇప్పటి వరకు మన టాప్ డైరెక్టర్స్ హాలీవుడ్ వెళ్లి అక్కడి నిర్మాణ విషయాలను పరిశీలిస్తూ ఉంటె ఒక హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి మన సినిమా నిర్మాణ విలువలను పరిశీలించడం మన తెలుగు సినిమా రంగానికి గౌరవంగా పేర్కోనాలి. 

No comments:

Post a Comment