Wednesday, January 29, 2014

అతనికి ప్రభాస్ 'బావ' అవుతాడట !


కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే బాగా ఇష్టమట. అందుకే ప్రభాస్ ని బావ అని పిలుచుకుంటారట. దీని గురించి స్వయంగా మోహన్ బాబు మాట్లాడుతూ " నేటి హీరోలలో ఎవరి స్టైల్ వారిది. అయితే అందరిలోకి నాకు మాత్రం ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఇద్దరం ఒకరినొకరం 'బావా బావా' అని పిలుచుకుంటాం" అని చెబుతున్నాడు మోహన్ బాబు. కాగా ఈ నెలాఖరున విడుదలవుతున్న 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా ద్వితీయార్ధనికి తన తనయుడు మనోజ్ తన భుజస్కందాలపై మోశాడని ఆయన చెప్పారు. " మా అబ్బాయని చెప్పడం లేదు. ఈ సినిమాలో మనోజ్ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఆడవేషం అధ్బుతంగా చేశాడు. నర్తనశాల సినిమాలో అన్నగారు ఎన్టీఆర్ పోషించిన బృహన్నల పాత్ర ఆయనకు ఎంతటి పేరు తెచ్చిందో ఈ సినిమాలో ఆడవేషం కూడా మనోజ్ కి అతంటి పేరు తెస్తుంది అంటూ తన తనయుడిని మోసేశాడు.

No comments:

Post a Comment