Friday, January 29, 2016

‘బాహుబలి 2’ కేరళ షెడ్యూల్ పూర్తి


BAAHUBALI

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి, ఆ సినిమాకు కొనసాగింపైన ‘పార్ట్ 2’ను గత నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల పాటు హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా గతవారం రోజులుగా ఓ చిన్న షెడ్యూల్ కోసం కేరళ అడవులకు షిఫ్ట్ అయింది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, అనుష్క తదితరుల కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి నేటితో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు.
ఇక ఈ షెడ్యూల్ పూర్తవ్వడంతో కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇచ్చి రాజమౌళి ఆ తర్వాత యూఎస్‌లో జరగబోయే భారీ షెడ్యూల్ కోసం సన్నాహాలు చేసుకోనున్నారు. బాహుబలి మొదటి భాగంలో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్న సస్పెన్స్‌ను అలాగే దాచిపెట్టిన రాజమౌళి, ఆ సస్పెన్స్ కోసం బాహుబలికి రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ వచ్చే వరకూ ఎదురుచూడమని చెప్పారు. దీంతో బాహుబలి రిలీజ్ అయిన రోజునుంచే ‘బాహుబలి 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్నారు. 2016 ఏడాది చివర్లో ‘బాహుబలి 2’ను విడుదల చేసేలా టీమ్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తోంది.

Tuesday, January 26, 2016

కేరళ ఫారెస్ట్ లో ప్రభాస్ మ్యానియా !

article data
https://www.facebook.com/weloveprabhas.blogspot.in/?ref=tn_tnmn
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ విధంగా పెరిగి పోయిందో తెలియచేసే ఆ సక్తికర సంఘటన ఈమధ్య ‘బాహుబలి 2’ షూటింగ్ స్పాట్ లో జరిగింది. మలయాళ సినిమా రంగ హీరోలను మన తెలుగు ప్రేక్షకులు బాగా పట్టించుకుంటారు కానీ మన తెలుగు హీరోలను కేరళా రాష్ట్ర ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అల్లుఅర్జున్ సినిమాలు మలయాళంలో డబ్ చేయబడి కొన్ని సినిమాలు విజయం సాధించినా బన్నీ కనిపించగానే మలయాళీలు మ్యానియా వచ్చినట్లుగా ప్రవర్తించరు. 

అయితే కేరళా ఫారెస్ట్ లో ప్రస్తుతం ‘బాహుబలి 2’ షూటింగ్ జరుగుతున్నా విషయాన్ని గ్రహించి ఆ ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేవారే కాకుండా దూర ప్రాంతం నుంచి కూడ చాలామంది ప్రభాస్ అభిమానులు వచ్చి అమరేంద్ర బాహుబలిని చాల ఆరాధనగా చూడటం హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’ విడుదల తరువాత కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మన పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు కర్నాటక కేరళ ప్రాంతాలలో ప్రభాస్ ఇమేజ్ ఏ విధంగా పెరిగి పోయిందో ఈ షూటింగ్ స్పాట్ కు వచ్చిన జనాన్ని చూస్తే అర్ధం అవుతుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 


రాజమౌళి  ‘బాహుబలి 2’ షూటింగ్ ను కేరళ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ కాని లేదా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన వార్తలు కాని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ కేరళ ఫారెస్టులో షూటింగ్ స్పాట్ కు నడిచి వస్తున్న ఫోటోను ఒక ప్రభాస్ అభిమాని తన సెల్ ఫోన్ లో క్లిక్ చేసి ఇలా వెబ్ మీడియాలో పెట్టాడు.

అనుకున్న అంచనాలు ప్రకారం ‘బాహుబలి 2’ మరోసారి రికార్డులను క్రియేట్ చేస్తే ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోతాడు అన్న విషయాన్ని ఈ ఫోటో మరోసారి రుజువు చేస్తోంది. ప్రస్తుతం అడవులలో నడుస్తున్న ప్రభాస్ ఫోటో నేటి రోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్..

రాజమౌళి అవార్డు వెనుక టాప్ సీక్రెట్..?!!

రాజమౌళి అవార్డు వెనుక టాప్ సీక్రెట్..?!! Share on Pinte Share on Reddit Share on Google Share on Linkedinhttps://www.facebook.com/weloveprabhas.blogspot.in/?ref=tn_tnmn
భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పుర్కారాలు పద్మశ్రీ,పద్మభూషన్, పద్మ విభూషన్. సినీ,క్రీడా,సామాజిక సేవా వివిధ రంగాల్లో సేవ చేసినందుకు గాను వారి సేవలు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించినందుకు గాను ఈ అవార్డులు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో దర్శకధీరుడు రాజమౌళికి అవార్డు వచ్చిందీ అనగానే బాహుబలి చిత్ర యూనిట్ ఎగిరి గంతేసింది. తెలుగు దర్శకుడు అందులోనూ అందరి అభిమానాన్ని సంపాదించిన రాజమౌళికి రావడం అనేది టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో గర్వ పడుతుంది.

మొదటి నుంచి విభిన్నమైన చిత్రాలు తీస్తూ అద్భుతమైన గ్రాఫిక్ టెక్నాలజీతో సినిమాలు తీస్తూ..ఓటమి ఎరుగుని దర్శకుడిగా రాజమౌళి తెలుగు ప్రేక్షకులు గుండెల్లో నిలిచి పోయారు. తాజాగా రాజమౌళికి ‘పద్మశ్రీ’ అవార్డు రావడం వెనుక ఓ పెద్ద ట్విస్టే ఉందట. వాస్తవానికి ఈ అవార్డు రావడం వెనుక మన తెలుగు రాష్ట్రాల ప్రమేయం ఏమాత్రం లేదట..వాస్తవానికి కళా,క్రీడలకు సేవలందించిన వారి పేర్లు ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తుంటాయి.


            రాజమౌళి అవార్డు వెనుక టాప్ సీక్రెట్..?!!
కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళికి మాత్రం పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి ఈ రికమండేషన్ వెళ్లిందట..అలా ఆయనకు అవార్డు దక్కడంలో ఆ రాష్ట్రం ప్రముఖ పాత్ర వహించిందట. ఇక దీనికో కారణం కూడా ఉంది..గతంలో రాజమౌళి కన్నడంలో  ‘కంటీరవ' అనే సినిమా చేశారు. అప్పట్లో ఆ సినిమా బాగా ఆడినా రాజమౌళికి మాత్రం పెద్దగా పేరు రాలేదు. కానీ ‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 

The Best Picture - Telugu goes to ‪#‎Baahubali‬. The Indian Epic Historical Fiction Film !! Congratulations to the whole team smile emoticon ‪#‎IIFAUtsavam‬

Hearty congratulations our the great director dear S.S.RAJAMOULI foh got the prestigious award padmadhri from "" WE LOVE PRABHAS'''' 


Monday, January 25, 2016

రజనీ, రామోజీ, రాజమౌళిలకు పద్మ అవార్డులు


rajini
భారత ప్రభుత్వం ప్రకటించే అత్యుత్తమ అవార్డుల్లో ‘భారత రత్న’ తరువాతి స్థానమైన ‘పద్మవిభూషణ్’ అవార్డుకు స్టూడియో అధినేత, పాత్రికేయ ప్రముఖులు రామోజీ రావు మరియు సూపర్ స్టార్ రజనీ కాంత్‌లు ఎంపికయ్యారు. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు గానూ రామోజీకి భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించగా, సినీ పరిశ్రమకు నటుడిగా సేవలందించినందుకు గానూ రజనీ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది.
ఇక ఇదిలా ఉంటే పద్మ అవార్డుల్లో భాగంగా ప్రకటించే ‘పద్మశ్రీ’ అవార్డుకు దర్శక ధీరుడు రాజమౌళి ఎంపికయ్యారు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన రాజమౌళి, సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గానూ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఇక ఇదే సమావేశంలో క్రీడా, వాణిజ్యం తదితర, వైద్యం తదితర రంగాల్లో సేవలందించిన పలువురికి పద్మ అవార్డులను ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. పద్మ అవార్డులకు ఎంపికైన రజనీ కాంత్, రామోజీ రావు, రాజమౌళిలకు ఈ సందర్భంగా 123తెలుగు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

బాహుబలి వల్లే.. నాన్నకు ప్రేమతో హిట్ అయ్యిందా..!?

సుకుమార్.. జీనియస్ గా పేరున్న తెలుగు దర్శకుడు.. పూర్వాశ్రమంలో లెక్కల మాస్టారైన ఈయన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్.. హిట్ అయినా ఫట్ అయినా సరే. సుకుమార్ సినిమా అంటే ఓసారి చూసి తీరాల్సిందే అనుకునే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. ఫ్లాప్ కు కూడా గౌరవం తెచ్చిన దర్శకుడు సుకుమార్ అని దిగ్గజ డైరెక్టర్లే అంటుంటారు. 

అలాంటి సుకుమార్ ఈ సంక్రాంతి మాంచి హిట్ కొట్టాడు. కొన్నాళ్లుగా హిట్ సినిమా కోసం మొహం వాచిపోయిన ఎన్టీఆర్ కు ఓ హిట్ ఇచ్చారు. నాన్నకు ప్రేమతో.. అంటూ సంక్రాంతి ప్రేక్షకులకు మాంచి ఇంటలిజెంట్ మూవీని అందించారు. టూ మచ్ లాజిక్ గా ఉంది.. అని కొందరు ప్రేక్షకులు కామెంట్ చేసినా.. ఓవరాల్ గా మంచి టాక్ సొంతం చేసుకుందీ సినిమా.

ఐతే.. విచిత్రం ఏంటంటే.. ఈ సంక్రాంతికు ప్రధానంగా పోటీ పడిన నాలుగు సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం. ఇలాంటి పరిణామం చాలా రేర్ గా జరుగుతుంటుంది. దర్శకులంతా సేఫ్ గేమ్ ఆడటంలో సక్సస్ అయ్యారనే చెప్పుకోవాలి. నాన్నకు ప్రేమతోతో సుకుమార్, డిక్టేటర్ తో శ్రీవాస్, ఎక్స్ ప్రెస్ రాజాతో మేర్లపాక గాంధీ, సోగ్గాడే చిన్ని నాయనాతో కల్యాణ్‌కృష్ణ.. నలుగురూ సంక్రాంతికి బాక్సాఫీస్ పంట పండించారు. 


ఈ నాలుగు సినిమాల సక్సస్ వెనుక బాహుబలి పాత్ర ఉందంటూ కామెంట్ చేస్తున్నారు సుకుమార్.. ఈ సినిమాల విజయానికి బాహుబలికి లింకేంటీ అనుకుంటున్నారా.. లింకు ఉందట. ఈ రాజమౌళి సినిమా వల్లే.. కొన్నేళ్ళుగా బయటకు రాని జనాలు ఇళ్ళల్లో నుంచి బయటికొచ్చి సినిమా హాళ్లకు వస్తున్నారట. 

బాహుబలి ఇచ్చిన సపోర్ట్ తోనే అన్ని సినిమాల వసూళ్లు పెరిగాయట. అందుకే థాంక్స్ టు బాహుబలి అంటున్నారు సుకుమార్.  నిజంగా ఇలాంటి కామెంట్ చేసిన సుకుమార్ ఔన్నత్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదా.

బాహుబలి అంటే తంబీలను మండిపోతోంది




అవును.. బాహుబలి పేరు చెబితే ఇప్పుడు తమిళనాడు ప్రజలకు ఒళ్లు మండిపోతోంది. వాళ్లకు ఇప్పుడీ పేరు కూడా చిరాకు పెట్టించేస్తోంది. దీనికి వాళ్ల దగ్గర సరైన కారణమే ఉందిలెండి. ఈ ఏడాది సౌత్ సినిమాలకు సంబంధించి జరిగిన తొలి అవార్డ్ ఫంక్షన్ ఐఐఎఫ్ ఏ. ఇందులో బాహుబలి తమిళ వెర్షన్ 12 అవార్డులను ఎగరేసుకుపోవడమే దీనికి కారణం. 

బెస్ట్ మూవీ - బెస్ట్ డైరెక్షన్ - బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అండ్ ఫిమేల్ - బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్.. ఇలా ప్రధాన అవార్డులన్నిటినీ బాహుబలి పట్టికెళ్లిపోయాడు. ఇలా ఓ తెలుగు నుంచి డబ్ అయిన సినిమా.. తమిళ అవార్డులను పట్టుకెళ్లిపోవడమే తమిళ తంబీలకు మండడానికి అసలు కారణం. బాహుబలి ని తమిళ వర్షన్ అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నా.. ఇది తమిళులు తీసిన సినిమా కాదు. హీరోలిద్దరూ తెలుగువారే. దీనికి తోడు డైరెక్టర్ కూడా తెలుగువాడే. అయినా సరే తమిళ జనాలు తీసుకోవాల్సిన అవార్డులు ఇప్పుడు తెలుగు సినిమాకి వెళ్లిపోయాయి. తెలుగు ప్రజలు వచ్చి తమిళ అవార్డులు తీసేసుకోవాడన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 

అందుకే తమిళ ప్రజలకు ఐఫా ఉత్సవం అవార్డుల్లో బాహుబలి 12 రావడం మండిపోతోంది. అసలు డైరెక్ట్ తమిళ్ సినిమా అయినా సరే.. ఒక్కదానికే ఇన్నేసి అవార్డులు రావడం దాదాపుగా అసాద్యం. కానీ ఓ డబ్బింగ్ సినిమాకి ఇన్నీ ఇచ్చేయడం వీరికి బాగా కోపం తెప్పిస్తోంది. అఫ్ కోర్స్.. ఇప్పుడే మొత్తం అయిపోలేదు. బాహుబలి ది కంక్లూజన్ తో ఈ కథ ఇంకా కంటిన్యూ కావాల్సి ఉంది. 

Monday, January 4, 2016

విక్రమ్ మాటలకు పడిపోయిన ప్రభాస్ !

కోలీవుడ్ టాప్ హీరో విక్రమ్ మాటలకు ప్రభాస్ పడిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ తో కోలీవుడ్ ప్రేక్షకులలో కూడ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రభాస్ విక్రమ్ డైరెక్షన్ లో ఒక పాటలో నటించబోతున్నాడు  అన్న వార్తలు వస్తున్నాయి. హీరో విక్రమ్ చెన్నై వరద బాధితుల కోసం తీస్తున్న 6 నిముషాల వీడియో సాంగ్ లో ప్రభాస్ నటిస్తున్నాడు.

‘స్పిరిట్ ఆఫ్ చెన్నై’ అన్న స్పూర్తితో తయారు చేస్తున్న ఈ పాటలో దక్షిణ భారత దేశానికి చెందిన ఎందరో టాప్ హీరోలు హీరోయిన్స్ ఈ వీడియో సాంగ్ లో కనిపించబోతున్నారు. అయితే టాలీవుడ్ కు సంబంధించి ఈ వీడియో సాంగ్ లో నటించే అవకాశం కోసం ప్రత్యేకంగా ప్రభాస్ కు పిలుపు రావడం అతడి స్థాయిని సూచిస్తోంది.

కోలీవుడ్ టాప్ హీరోలు విజయ్, సూర్యాలతో పాటుగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, మోహన్ లాల్, నిత్యామీనన్, హన్సిక వంటి ఎందరో టాప్ సెలెబ్రెటీలు నటిస్తున్న ఈ వీడియో సాంగ్ షూటింగ్ ఈరోజు నుండి చెన్నైలో ప్రారంభం కాబోతోంది. అయితే వీరందరితో సమానంగా ప్రభాస్ కు పిలుపు రావడమే కాకుండా ప్రభాస్ పై ఈ పాటకు సంబంధించిన ఒక ప్రత్యేక చరణాన్ని చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

తమిళ చానెల్స్ అన్నింటిలోను ప్రసారం అయ్యే ఈ పాట ద్వారా చెన్నై వరద బాధితులకు మరింత సహాయం చేయమని ఈ సెలెబ్రెటీలు అంతా కోరబోతున్నారు. కోలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న ప్రభాస్ కు ఈ అవకాశం అనుకోని ట్విస్ట్ గా మారింది అని అంటున్నారు.. 

Sunday, January 3, 2016

ప్రభాస్ ముగింట వాలిన బాలీవుడ్ ఆఫర్స్ ఇవే...

 

ప్రభాస్ ముగింట వాలిన బాలీవుడ్ ఆఫర్స్ ఇవే
ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన పాపులారిటిని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పవచ్చు. మొన్నటి వరకూ టాలీవుడ్ కే పరిమితం అయిన ప్రభాస్, ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీను మించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బడా స్టార్ గా ఎదిగాడు. అయితే ఈ విషయాన్ని ప్రభాస్ మాత్రం ఒప్పుకోవటం లేడు. కేవలం ఒక్కసిమాతోనే తను ఇండియన్ స్టార్ గా మారటం అనేది కరెక్ట్ కాదనేది ప్రభాస్ వాదన.

ఇదిలా ఉంటే, ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ స్టార్ ఐకాన్ గా నిలిచారు. తెలుగు సినిమా బాలీవుడ్‌లో సత్తా చాటటమే కాకుండా,100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో టాలీవుడ్ సత్తాని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించింది. అంతే కాకుండా ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తోనే మహీంద్ర సంస్థ టీయూవీ 300 వాహనంకు ప్రభాస్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. దీంతో ప్రభాస్ మరింత పాపులర్ అయ్యాడు. నిజానికి ఈ యాడ్ లో షారుఖ్ ని తీసుకోవాలని మహింద్ర సంస్థ చూసింది.

కానీ బాహుబలి పాపులారిటీకి షారుఖ్ ని కాదని ప్రభాస్ ని సెలక్ట్ చేశారు మహింద్ర సంస్థ. ఇక బాలీవుడ్ ఆఫర్స్ విషయానికి వస్తే, బాహుబలి2 తరవాత ప్రభాస్ కాల్షీట్స్ కోసం పలు బాలీవుడ్ చిత్రాలు వెయిట్ చేస్తున్నాయి. ‘ధూమ్ 4’ సినిమాలో ప్రభాస్ కి ఓ రోల్ ధక్కింది. ఈ వివరాలను సరిగ్గా బాహుబలి2 రిలీజ్ సమయంలో రివీల్ చేసేందుకు ప్రభాస్ అంగీకారం తెలిపాడు. అలాగే కరణ్ జోహార్ సొంత ప్రొడక్షన్ లో ప్రభాస్ కి ఆఫర్ వచ్చింది.

గతంలో బాలీవుడ్ లో నటించే ప్రసక్తే లేదన్న ప్రభాస్, తాజాగా“బాహుబలి తర్వాత వేరే ఇతర భాషల నుంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా చేస్తా” అని చెప్పటం ఎంతో విశేషం. ఇక ప్రభుదేవా డైరెక్షన్ లో ఓ మూవీకి ప్రభాస్ హీరోగా చేసే అవకాశం ఉంది. ఇది హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరణ జరపుకోనుంది. దాదాపు 3 నుండి 5 చిత్రాల వరకూ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఆఫర్స్ ప్రభాస్ ముంగిట ఉన్నాయి. వీటిలో ప్రాభాస్ ఏది సెలక్ట్ చేసుకుంటాడు అనేది తన అభిప్రాయం పైనే ఆధారపడి ఉందట.