కోలీవుడ్ టాప్ హీరో విక్రమ్ మాటలకు ప్రభాస్ పడిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ తో కోలీవుడ్ ప్రేక్షకులలో కూడ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రభాస్ విక్రమ్ డైరెక్షన్ లో ఒక పాటలో నటించబోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. హీరో విక్రమ్ చెన్నై వరద బాధితుల కోసం తీస్తున్న 6 నిముషాల వీడియో సాంగ్ లో ప్రభాస్ నటిస్తున్నాడు.
‘స్పిరిట్ ఆఫ్ చెన్నై’ అన్న స్పూర్తితో తయారు చేస్తున్న ఈ పాటలో దక్షిణ భారత దేశానికి చెందిన ఎందరో టాప్ హీరోలు హీరోయిన్స్ ఈ వీడియో సాంగ్ లో కనిపించబోతున్నారు. అయితే టాలీవుడ్ కు సంబంధించి ఈ వీడియో సాంగ్ లో నటించే అవకాశం కోసం ప్రత్యేకంగా ప్రభాస్ కు పిలుపు రావడం అతడి స్థాయిని సూచిస్తోంది.
కోలీవుడ్ టాప్ హీరోలు విజయ్, సూర్యాలతో పాటుగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, మోహన్ లాల్, నిత్యామీనన్, హన్సిక వంటి ఎందరో టాప్ సెలెబ్రెటీలు నటిస్తున్న ఈ వీడియో సాంగ్ షూటింగ్ ఈరోజు నుండి చెన్నైలో ప్రారంభం కాబోతోంది. అయితే వీరందరితో సమానంగా ప్రభాస్ కు పిలుపు రావడమే కాకుండా ప్రభాస్ పై ఈ పాటకు సంబంధించిన ఒక ప్రత్యేక చరణాన్ని చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
తమిళ చానెల్స్ అన్నింటిలోను ప్రసారం అయ్యే ఈ పాట ద్వారా చెన్నై వరద బాధితులకు మరింత సహాయం చేయమని ఈ సెలెబ్రెటీలు అంతా కోరబోతున్నారు. కోలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న ప్రభాస్ కు ఈ అవకాశం అనుకోని ట్విస్ట్ గా మారింది అని అంటున్నారు..
No comments:
Post a Comment