Monday, January 25, 2016

బాహుబలి వల్లే.. నాన్నకు ప్రేమతో హిట్ అయ్యిందా..!?

సుకుమార్.. జీనియస్ గా పేరున్న తెలుగు దర్శకుడు.. పూర్వాశ్రమంలో లెక్కల మాస్టారైన ఈయన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్.. హిట్ అయినా ఫట్ అయినా సరే. సుకుమార్ సినిమా అంటే ఓసారి చూసి తీరాల్సిందే అనుకునే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. ఫ్లాప్ కు కూడా గౌరవం తెచ్చిన దర్శకుడు సుకుమార్ అని దిగ్గజ డైరెక్టర్లే అంటుంటారు. 

అలాంటి సుకుమార్ ఈ సంక్రాంతి మాంచి హిట్ కొట్టాడు. కొన్నాళ్లుగా హిట్ సినిమా కోసం మొహం వాచిపోయిన ఎన్టీఆర్ కు ఓ హిట్ ఇచ్చారు. నాన్నకు ప్రేమతో.. అంటూ సంక్రాంతి ప్రేక్షకులకు మాంచి ఇంటలిజెంట్ మూవీని అందించారు. టూ మచ్ లాజిక్ గా ఉంది.. అని కొందరు ప్రేక్షకులు కామెంట్ చేసినా.. ఓవరాల్ గా మంచి టాక్ సొంతం చేసుకుందీ సినిమా.

ఐతే.. విచిత్రం ఏంటంటే.. ఈ సంక్రాంతికు ప్రధానంగా పోటీ పడిన నాలుగు సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం. ఇలాంటి పరిణామం చాలా రేర్ గా జరుగుతుంటుంది. దర్శకులంతా సేఫ్ గేమ్ ఆడటంలో సక్సస్ అయ్యారనే చెప్పుకోవాలి. నాన్నకు ప్రేమతోతో సుకుమార్, డిక్టేటర్ తో శ్రీవాస్, ఎక్స్ ప్రెస్ రాజాతో మేర్లపాక గాంధీ, సోగ్గాడే చిన్ని నాయనాతో కల్యాణ్‌కృష్ణ.. నలుగురూ సంక్రాంతికి బాక్సాఫీస్ పంట పండించారు. 


ఈ నాలుగు సినిమాల సక్సస్ వెనుక బాహుబలి పాత్ర ఉందంటూ కామెంట్ చేస్తున్నారు సుకుమార్.. ఈ సినిమాల విజయానికి బాహుబలికి లింకేంటీ అనుకుంటున్నారా.. లింకు ఉందట. ఈ రాజమౌళి సినిమా వల్లే.. కొన్నేళ్ళుగా బయటకు రాని జనాలు ఇళ్ళల్లో నుంచి బయటికొచ్చి సినిమా హాళ్లకు వస్తున్నారట. 

బాహుబలి ఇచ్చిన సపోర్ట్ తోనే అన్ని సినిమాల వసూళ్లు పెరిగాయట. అందుకే థాంక్స్ టు బాహుబలి అంటున్నారు సుకుమార్.  నిజంగా ఇలాంటి కామెంట్ చేసిన సుకుమార్ ఔన్నత్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదా.

No comments:

Post a Comment