Friday, March 17, 2017

బాహుబలి 2 ట్రైలర్ పై తారల స్పందన

నిర్మాణం విషయంలో ఎక్కడ రాజీపడకుండా తెరకెక్కి....రికార్డులు సృష్టిస్తున్న బాహుబలి2 మూవీ ట్రైలర్ చూసిన సెలబ్రిటీలు ఉద్వేగానికి లోనవుతూ...ట్విట్టర్ వేదికగా రాజమౌళికి హీరో ప్రభాస్, రానాలకు, చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలుపుతున్నారు. ట్రైలర్ చూసి మీరిచ్చిన అపూర్వ సంపాదనకు ధన్యవాదాలు...గంటలో బాహుబలి మిలియన్ చేరుకోవడం ఆనందంగా ఉన్నదని రాజమౌళి అన్నారు.

రాంగోపాల్ వర్మ: బాహుబలి 2 అన్ని సినిమాలకే తాతలాంటిది. తమిళ వర్షన్ చూశాను వర్ణించలేకపోతున్నా.
వీరేంద్ర సెహ్వాగ్: హిందీ వెర్షన్ లో బాహుబలి 2 ట్రైలర్ చూశాను. నా భావాన్ని వ్యక్తం చేయడానికి ఈ భూమ్మీద ఏదైనా భాష ఉందా అని ఆలోచించకుండా ఉండలేకపోయాను.  
సమంతా: రాజమౌళి మెదడు ఎలా పని చేస్తుందన్న దానిపై ఎవరైనా క్లాసులు పెడితే నేను అందులో చేరిపోతా. 
జూ.ఎన్టీఆర్: ఇప్పటి వరకు కలగని అనుభవం వచ్చింది. ఊపిరి సలపకపోయినా చూడకుండా ఉండలేం. అదే జక్కన్న వైభవం.
నాని: బాహుబలి అభిమానులకే కాకుండా సినీ అభిమానులందరికీ.. ఈ రోజు శివరాత్రే.. త్వరగా తెరపైకి తీసుకురండి కెప్టెన్(రాజమౌళి).. ఇంకా వేచి చూడలేకపోతున్నాం..
కళ్యాణ్ రామ్: ట్రైలర్ చూసి చెప్పేయవచ్చు. అవుట్ స్టాండింగ్ అని.. బాహుబలి టీంకు ఆల్ ద బెస్ట్. 
రోహిత్ రాయ్: మై గాడ్ వాట్ ఏ ట్రైలర్.. సినిమా కోసం వేచి చూడటం నా వల్ల కాదు..
రామ్ నటుడు: కొట్టిన బంతి బౌండరీ దాటించడం సర్వసాధారణమే. కానీ రాజమౌళి కొట్టిన ప్రతి బంతి బౌండరీని జరిపేయడం విశేషం.
సాయి ధరమ్ తేజ్: ట్రైలర్ చూస్తున్నంత చేసే ఈల వేయకుండ ఉండలేని స్థితి. బాహుబలి బృందానికి ఆల్ ద బెస్ట్..

No comments:

Post a Comment