Thursday, March 16, 2017

బాహుబ‌లి రికార్డ్స్ కి వణుకు పుట్టింది

బాహుబలి-2 ట్రైలర్ ఆ లాజిక్.. రాజమౌళి ప్లానేనా..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి-ది కంక్లూజన్’ మూవీ ఇప్పుడు బాలీవుడ్‌ లో ప్రకంపనాలను క్రియేట్ చేస్తుంది. మొదటి నుండి ఈ మూవీపై మార్కెట్ లో భారీ అంచనాలను ఉండటంతో ‘బాహుబలి-ది కంక్లూజన్’ట్రైలర్ పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘బాహుబలి-ది కంక్లూజన్’ వర్సెస్ బాలీవుడ్‌ అన్నట్టుగా మారింది.

బాలీవుడ్‌ లో ప్రముఖ మూవీలకి ‘బాహుబలి-ది కంక్లూజన్’ ట్రైలర్ వణుకు పుట్టిస్తుందని అంటున్నారు. ఎందుకంటే ‘బాహుబలి-ది కంక్లూజన్’ మూవీ బిటౌన్ లో సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకూ బాలీవుడ్‌ లో ఏ మూవీకి రానంత క్రేజ్‌ ‘బాహుబలి-ది కంక్లూజన్’ కి రావటమే ఇందుకు కారణం.

‘బాహుబలి-ది కంక్లూజన్’ హిందీ వెర్షన్ ట్రైలర్ ఇప్పటికే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్‌ ఖాన్ వంటి స్టార్స్ నటించిన సినిమాల గత యూ ట్యూబ్‌ రికార్డ్స్ అన్నీ బ్రేక్‌ అయ్యాయి. అలాగే దంగల్‌ బాక్సాపీస్ రికార్డ్ 400 కోట్ల రూపాయలను సైతం ‘బాహుబలి-ది కంక్లూజన్’ బ్రేక్‌ చేస్తుందనే టాక్స్ బిటౌన్ మార్కెట్ లో బాహాటంగానే వినిపిస్తున్నాయి.

బాహుబలి మొదటి వెర్షన్ మూవీకి హిందీలో 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి, బాహుబలి2కి కనీసం 300 వందల కోట్ల రూపాయలు కలెక్షన్స్ వరకూ రావచ్చని అంటున్నారు. అయితే బాలీవుడ్‌ మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ మూవీకి కేవలం హిందీలోనే 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ వరకూ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

No comments:

Post a Comment