Sunday, March 26, 2017

బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మీరూ భాగం కావొచ్చు.


మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ బాహుబలి-2 సినిమాకు సంబంధించి మరికొన్ని గంటల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా ప్రారంభంకానుంది. ఈ వేడుకకు సంబంధించి రామోజీఫిలింసిటీ బయట భారీ ఏర్పాట్లు చేశారు. 10వేల మందికి పైగా సరిపోయేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. కేవలం ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసమే కోటి రూపాయల ఖర్చుతో, మాహిష్మతి ఛాయలు కనిపించేలా సెట్ వేశారు. ఇప్పుడీ ఫంక్షన్ లో మీరూ భాగం కావొచ్చు. ఆ మేరకు డిజిటల్ ఏర్పాట్లు చేసింది బాహుబలి టీం. 
సాధారణంగా ఏ ఈవెంట్ అయినా టీవీల్లో ప్రసారం అవుతుంది. అయితే బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను మాత్రం టీవీలతో పాటు యూట్యూబ్ లో కూడా లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. పైగా టీవీలతో పోలిస్తే, యూట్యూబ్ లో చూసేవాళ్లకు తాము కూడా ఈవెంట్ లోనే ఉన్నామనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే, యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లో 360 డిగ్రీస్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నారు. 
మాహిష్మతి సెట్ కు సంబంధించి ఇప్పటికే వీఆర్ ఎక్స్ పీరియన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది బాహుబలి టీం. మాహిష్మతి సామ్రాజ్యాన్ని అన్ని కోణాల నుంచి చూసే వీలు కలిగింది. సరిగ్గా అదే అనుభూతిని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా అందించబోతున్నారు. 
రేడియన్ లూమ్ టెక్నాలజీ ఆధారంగా బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్ ను యూట్యూబ్ లో ప్రసారం చేస్తారు. ఈ లైవ్ చూస్తే, మనం కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుందట. సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రారంభం అవుతుంది.

No comments:

Post a Comment