Friday, March 17, 2017

వేల మంది అమ్మాయిల కంటే ప్రభాసే..



బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ వచ్చేసింది. యూట్యూబ్ రికార్డుల భరతం పడుతున్న బాహుబలి.. ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించేస్తోంది. మరోవైపు ఈ ట్రైలర్ కి అన్ని వర్గాల నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సంచలన దర్శకుడు అండ్ సెన్సేషనల్ ట్వీటర్ రామ్ గోపాల్ వర్మ కూడా తన స్టైల్ లో ట్వీట్స్ పెట్టాడు.

ముఖ్యంగా ప్రభాస్ లుక్ విషయంలో మాత్రం తెగ ప్రశంసలు వచ్చేస్తున్నాయి. యుద్ధ సన్నివేశాల్లో అయినా.. రొమాంటిక్ సీన్స్ లో అయినా.. ఎమోషనల్ ఎపిసోడ్స్ లో అయినా.. ప్రభాస్ తన స్టైల్ లో పండించేశాడు. ఇప్పుడీ లుక్స్ పై ట్వీట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ.. '10వేల మంది అందమైన అమ్మాయిల కంటే బాహుబలి2 ట్రైలర్ లో ప్రభాస్ అందంగా కనిపిస్తున్నాడు' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. 

ఈ డైరెక్టర్ అన్నాడని కాదు కానీ.. నిజంగానే బాహుబలి 2 ట్రైలర్ లో ప్రభాస్ లుక్ ఆ స్థాయిలోనే ఉంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ నాలుగేళ్ల సమయాన్ని కేటాయించడం మాత్రమే కాదు.. ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో త్యాగాలు చేశాడు. అందుకు తగ్గ ప్రతిఫలాన్ని.. ఇలా క్రేజ్ రూపంలో అందుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. 

No comments:

Post a Comment